గ్లామర్ రోల్స్ కోసం ట్రై చేస్తున్న అందాల రాక్షసి..!

0

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఫస్ట్ సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ.. అభినయం ఆకర్షణీయమైన రూపం అందరినీ ఆకట్టుకుంది. ‘భలే భలే మగాడివోయ్’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలు లావణ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక గతేడాది వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే పర్ఫార్మెన్స్ రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ లో కూడా నటించాలని ఎప్పటినుంచో తాపత్రయపడుతున్న లావణ్య త్రిపాఠికి అలాంటి రోల్స్ మాత్రం రావడం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ డెహ్రాడూన్ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఛాన్సెస్ మాత్రమే వస్తున్నాయి.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి.. సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్సప్రెస్’ మరియు కార్తికేయ గుమ్మకొండ తో ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోయడానికి ఆస్కారం లేని పాత్రల్లోనే ఆమె నటిస్తుందని తెలుస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఈ బ్యూటీ యంగ్ విడో గా కనిపించబోతుందట. ఇప్పటికే విడుదలైన టీజర్ లో హీరో భర్త చనిపోయిన అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు చూపించారు. అలానే ఈ సినిమాలో మల్లిక పాత్రలో కనిపిస్తున్న లావణ్య ఫస్ట్ లుక్ కూడా ఇది నిజమే అనే విధంగా ఉంది. ఇక గ్లామర్ రోల్స్ చేసే అవకాశం రాకపోవడంతో ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అట్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. తన హాట్ ఫొటో షూట్స్ లో సెక్సీ ఫోటోలను షేర్ చేస్తూ ఆడియెన్స్ ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా మేనేజ్ చేస్తోంది. మరి ఈ ఫొటోస్ చూసైనా గ్లామర్ రోల్స్ ఇస్తారేమో చూడాలి.