లారెన్స్ మెడకు తమ్ముడి కేసు

0

ఇటీవల దివ్య అనే జూనియర్ ఆర్టిస్టు దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్(వినోద్) తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నన్ను మాత్రమే కాకుండా తన అన్న పేరును వాడుకుని ఎల్విన్ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించింది. ఇదే సమయంలో దివ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలో తాను వెస్ట్ మారేడ్ పల్లి సీఐకి ఫిర్యాదు చేశాను అని ఆయన కేసు విషయం మాట్లాడేందుకు లాడ్జ్ కు రావాల్సిందిగా అసభ్యంగా ప్రవర్తించాడని దివ్య చెప్పుకొచ్చింది.

ఎల్విన్ ప్రేమను తాను తిరష్కరించిన కారణంగా తన వద్ద ఉన్న నా నెంబర్ కు ఫోన్ చేసి పదే పదే బెదిరిస్తున్నాడు. అతడికి లారెన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఎల్విన్ ఇంకా లారెన్స్ లతో పాటు మాజీ వెస్ట్ మారెడ్ పల్లి సీఐ రవీందర్ రెడ్డి పై కూడా దివ్య ఫిర్యాదు చేసింది. ఎస్సీ ఎస్టీ కమీషన్ ముందుకు ఈమె వెళ్లడంతో పరిస్థితి సీరియస్ అయ్యింది.

2006 సంవత్సరం నుండి రవీందర్ రెడ్డి తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని.. తనపై అక్రమ కేసులు పెడతానంటూ బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు అంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయాల్సిందిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేసింది. ఈ కేసును విచారించాల్సిందిగా ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దివ్య పెట్టిన కేసుపై స్పందించేందుకు లారెన్స్ ఆసక్తి చూపించలేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-