బికినీలో పాప విశ్రాంతి

0

రాయ్ లక్ష్మి పేరు తెలియని ప్రేక్షకులు తక్కువమంది ఉంటారు. ఎందుకంటే దాదాపుగా అన్నీ దక్షిణాది భాషలలలో నటించింది. తెలుగులో ‘రత్తాలు రత్తాలు’ లాంటి సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ తో పాటుగా కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలలో కూడా నటించింది. అయితే ఈమధ్య తెలుగులో కొంచెం హవా తగ్గింది. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో హవా పెరిగింది. హాట్ ఫోటోలతో గ్లామర్ స్ట్రైక్స్ చెయ్యడం రాయ్ లక్ష్మికి అలవాటుగా మారింది.

ప్రస్తుతం ఈ భామ దుబాయ్ వెకేషన్ లో ఉంది. అక్కడ సరదాగా గడుపుతూ వీలు చిక్కినప్పుడల్లా ఫోటో షూట్లు చేస్తూ అసలే ఎడారి ప్రాంతమైన దుబాయ్ ఉష్ణోగ్రతలను మరింతగా పెంచడానికి తన వంతు కృషి చేస్తోంది. తాజాగా రెండు ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “ఎక్కడ వెలుగు ఉందో అక్కడ నన్ను ఉంచండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక ఫోటోలో పూల్ దగ్గర ఒక బెడ్ పై పడుకొని సేదదీరుతూ కూలింగ్ గ్లాసెస్ ధరించి కళ్ళు మూసుకుంది. రెండో ఫోటోలో రూఫ్ టాప్ పై గ్లాస్ వాల్ కు ఆనుకుని యమా స్టైలిష్ పోజిచ్చింది. స్పెషల్ డిజైన్ ఉండే మోనోకిని ధరించి మరీ ఈ ఫోటోలకు పోజివ్వడం విశేషం. రెడ్ కలర్ లిప్ స్టిక్.. పట్టులా నిగనిగా మెరిసే చర్మ సౌందర్యంతో రాయ్ లక్ష్మి సూపర్ హాట్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్లు సరదా కామెంట్లతో తమ జేజేలు తెలిపారు. “నీకు నిద్ర.. మాకు నిద్ర లేదు”.. “లెగ్ పీసులు సూపర్”.. “సో సో సెక్సీ”.. అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ.. కన్నడలో ‘ఝాన్సి’ అని మూవీలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer