బికినీలో కిల్లర్ ఫిష్

0

హాట్ బ్యూటీ అనగానే సహజంగా ముంబై నుంచి వచ్చిన భామ.. లేదా నార్త్ భామ అనుకుంటాం కానీ సౌత్ లో కూడా హాటు బాంబులకు కొదవ లేదు. రాయ్ లక్ష్మి సరిగ్గా అలాంటి కేటగిరీలో ఉండే భామే. దాదాపు అన్నీ సౌత్ భాషలలో నటించిన రాయ్ లక్ష్మి తెలుగులో కూడా చాలా సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే లీడ్ రోల్ లో నటించిన సినిమాలు హిట్ కాలేదు కానీ ఐటెం నంబర్ చేసిన ప్రతిసారి మాస్ ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ముఖ్యంగా రత్తాలు రత్తాలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. రాయ్ లక్ష్మికి ఎంత పేరు తీసుకోచ్చిందో అందరికీ తెలుసు.

ఈ భామ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేసే ప్రయత్నాలను అసలు ఆపదు. రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసి అమాయకమైన మగజాతిని ఏడిపించడం రాయ్ కి అలవాటే. నిన్న అదేపని మరోసారి చేసింది. ఒక కత్తిలాంటి ఫోటోను ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసి “నేను చేసిన ప్రతి పొరపాటు నుంచి నేర్చుకుని ఇప్పుడు ఉన్నట్టుగా తయారయ్యాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి రత్తాలు ఎలాంటి పొరపాట్లు చేసిందో.. వాటినుంచి ఏం నేర్చుకుందో వివరంగా మాత్రం వివరించలేదు. అయితే నెటిజన్లకు ఆ పొరపాట్లతో పనేమీ లేదు. వారికి కావాల్సింది ఫోటోనే. ఆ ఫోటో ఎప్పటిలాగే అదిరిపోయింది. బ్లాక్ బికిని ధరించి ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ లొకేషన్ లో రిసార్టులోని చెక్క బెంచిపై కూర్చుంది. చలువ కళ్ళజోడు ధరించి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన అందాన్ని నెటిజన్లను ఆస్వాదించమన్నట్టుగా పోజిచ్చింది.

ఈ ఫోటోకు నెటిజన్ల స్పందన కూడా సూపర్ గానే ఉంది. “కిల్లర్ ఫిష్”.. “హాట్ బార్బీ డాల్”.. “స్పైసీ బికినీ”.. “ఈ వేడికి నా హృదయం కరిగింది” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ.. కన్నడలో ‘ఝాన్సి’ అని మూవీలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer