గ్లామర్ స్టార్ లోని కొత్త యాంగిల్ చూడనున్నామా?

0

రాయ్ లక్ష్మీని ఇప్పటి వరకు గ్లామర్ స్టార్ గానే ప్రేక్షకులు చూశారు. తెలుగు.. తమిళంతో పాటు హిందీలో కూడా నటించిన రాయ్ లక్ష్మీ ఇప్పటి వరకు స్కిన్ షోలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ నటించింది. ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్ గానే గుర్తింపు దక్కించుకున్న రాయ్ లక్ష్మీని తాను కొత్తగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు వినో వెంకటేష్ అంటున్నాడు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిండ్రెల్లా’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.

కన్నడకు చెందిన వినో వెంకటేష్ మల్టీ మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య వద్ద నాలుగు సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా చేసిన వెంకటేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీని కొత్తగా చూస్తామా అనిపిస్తుంది.

సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు వినో వెంకటేష్ మాట్లాడుతూ… ఈ చిత్రం దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే. అయితే గతంలో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. రెగ్యులర్ హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల తరహాలో కాకుండా చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలోని రాయ్ లక్ష్మీ పాత్ర ఆమె ఇప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ ను బ్రేక్ చేస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం ఆమె కెరీర్ లోనే నిలిచిపోయే సినిమా అవుతుందన్నాడు.

ఈ చిత్రంలో విలన్ పాత్రను సాక్షీ అగర్వాల్ పోషించిందట. విలన్ పాత్ర సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుందని కూడా దర్శకుడు నమ్మకంగా చెబుతున్నాడు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అశ్వమిత్ర అందించగా సినిమాటోగ్రాఫీని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంకు వర్క్ చేసిన రామి అందించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు ప్రకటించాడు.
Please Read Disclaimer