రత్తాలు బికిని.. వెరైటీ లుక్కు

0

హాటు భామలు ఎప్పుడూ కేరాఫ్ ముంబై అనుకుంటారు. కానీ సౌత్ లో కూడా చాలామంది హాటు భామలు ఉన్నారు. ఆ లిస్టు లో రాయ్ లక్ష్మి ఒకరు. సౌత్ లో అన్ని భాషల్లో నటించిన ఈ భామ హిందీలో కూడా నటించింది. ‘ఖైది నెం. 150’ లో ‘రత్తాలు రత్తాలు’ పాటకు డ్యాన్స్ చేసిన రాయ్ లక్ష్మి తెలుగు వారిని మెప్పించి రత్తాలు గా మారి పోయింది. ఈ భామకు సోషల్ మీడియా లో మంటలు పెట్టడం ఒక హాబీ.

ఈ భామ గత కొన్ని రోజులుగా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాంటి లొకేషన్ లో సూపర్ వెకేషన్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోకుండా ఉన్నా సోషల్ మీడియాలో షేర్ చేయకపోయినా నెటిజన్ల మనోభావాలు దెబ్బతింటాయి కదా? అందుకే రాయ్ లక్ష్మి అలాంటి పొరపాటు చెయ్యలేదు. ఇన్స్టా ఖాతాద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “కళ్ళు అబద్ధాలు చెప్పవు #వీకెండ్ మూడ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి రత్తాలు కళ్ళలో ఏముందో.. మీకేం అర్థం అయిందో.. అదే అర్థం చేసుకోండి. ఇక ఫోటో విషయానికి వస్తే నారింజ -నలుపు రంగు కాంబినేషన్లో ఉన్న బికినీ ధరించి టెర్రేస్ పై ఒక రిలాక్సింగ్ చెయిర్ పై మోకాళ్ళపై కూర్చుని అందాలు ధారపోస్తూ.. కూలింగ్ గ్లాసుల గ్యాప్స్ లో నుంచి నెటిజన్లను చూస్తోంది. ఈ ఫోటోలో మరో హైలైట్ రత్తాలు చిలిపి చిరునవ్వు.

ఈ ఫోటోకు చాలామంది నెటిజన్లు ఫిదా అయ్యారు. “సూపర్ హాట్ రత్తాలు”.. “దుబాయ్ వేడి ఇంకా పెరిగింది”.. “సెక్సీ & స్టన్నింగ్”.. అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ.. కన్నడలో ‘ఝాన్సి’ అనే మూవీలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer