హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు

0

ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తండ్రి రమేశ్ కడవ్లా మీద ప్రముఖ హాస్యనటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లా ఒక ఫ్లాట్ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర రూ.2.70 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని కమెడియన్ సూరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఎన్నో సార్లు అడిగానని.. అయినా ఐదేళ్లుగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపాడు.

రమేశ్ తోపాటు ఫైనాన్షియర్ అంబువేల్ రాజన్ కు కూడా ఇందులో ప్రమేయం ఉందని.. అంతేకాకుండా వీరధీర సూరన్ సినిమాకు గాను తనకు ఇవ్వాల్సిన రూ.40 లక్షల పారితోషకాన్ని ఎగ్గొట్టారని కమెడియన్ సూరి ఆరోపించారు.

సూరి ఫిర్యాదు మేరకు పోలీసులు హీరో తండ్రి రమేశ్ తోపాటు అంబువేల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ గతంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.

తన తండ్రిపై వచ్చిన ఫిర్యాదుపై హీరో విష్ణు విశాల్ స్పందించాడు. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది షాకింగ్ గా ఉందని.. బాధ కలిగించేదిగా ఉందన్నారు. నాపై మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 2017లో పారంబై సినిమా కోసం మా దగ్గర అడ్వాన్స్ తీసుకొని తిరిగి సూరి ఇవ్వలేదని హీరో విష్ణు కౌంటర్ దాడి చేశాడు.