వెటరన్ హీరోలకు హీరోయిన్ల టార్చరేమిటో

0

వెటరన్ హీరోలకు కథానాయికల్ని వెతకాలంటే తల బొప్పి కట్టేస్తోందన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. యువకథానాయికలు ససేమిరా అనేస్తుండడంతో వెటరన్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పాత ముఖాలే అయినా తిరిగి సీనియర్ భామలనే వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది.

ఇటీవలి కాలంలో ఫేడవుట్ అని భావిస్తున్న భామల్నే వెంటాడి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఎన్.బీ.కే 106 కి పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. బోయపాటి ఇప్పటికే పలువురు భామల్ని సంప్రదించినా ఎవరి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం చూస్తుంటే సన్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్యకు ప్రతిసారీ కథానాయికల్ని వెతకడం సమస్యగానే ఉంది. ఈసారి మరీ ఇబ్బందికరంగా ఉందట.

బాలయ్య-బోయపాటి తాజా చిత్రం కోసం ఇద్దరు భామల్ని నాయికలుగా ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికే అంజలి ఓ కథానాయికగా ఫైనల్ అయ్యింది. మరో నాయికగా కాజల్ లేదా తమన్నా ఇద్దరిలో ఎవరో ఒకరిని కన్ఫామ్ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ఇక వీళ్లతో పాటు శ్రీయ పేరు కూడా తామరతంపరగా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యత కాజల్ కి. అందుకే కాజల్ కి ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తాను అన్న తీరుగానే ఉందిట. దీంతో తమన్నాను సంప్రదించారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మిల్కీ బ్యూటీ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని తెలిసింది. అసలే వరుస ఫ్లాపులతో బాలయ్య మార్కెట్ కిందికి పడిపోయింది. భారీ బడ్జెట్లు వెచ్చించి భారీ పారితోషికాలతో సినిమాలు తీస్తే రాబట్టడం అంత సులువేమీ కాదు. అందుకే ఇప్పుడు పారితోషికాల్ని సాధ్యమైనంత కోసేసే పరిస్థితి ఉంటే తమన్నా ఇలా డిమాండ్ చేయడం సరికాదన్న మాటా వినిపిస్తోంది. కానీ పట్టాలపై ఉన్న రైలు పరిగెట్టాలంటే ఇంజినాయిల్… గ్లామర్ పవర్ రెండూ తప్పనిసరి. తమన్నాను ఒప్పించకపోతే ఇప్పట్లో కథానాయిక దొరికే పరిస్థితి కనిపించడం లేదట. మరి నిర్మాత మిరియాల రవీందర్ – బోయపాటి బృందం తననే రప్పిస్తారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-