‘కలర్ ఫోటో’ పై మోజు పడ్డ ప్రముఖ నిర్మాత..!

0

ప్రముఖ హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ”కలర్ ఫోటో”. ఈ చిత్రాన్ని ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సీనియర్ కమెడియన్ సునీల్ పూర్తి స్థాయి విలన్ గా నటించిన ‘కలర్ ఫోటో’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టున్నాయి. దీంతో ఇప్పుడు ‘కలర్ ఫోటో’ పై ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాణ సంస్థలు మోజు పడుతున్నాయట.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ‘కలర్ ఫోటో’ సినిమాని గీతాఆర్ట్స్ 2 సమర్పణలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు కాబట్టి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. దీనిని బట్టి చూస్తే ‘కలర్ ఫోటో’ సినిమా ‘ఆహా’ యాప్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. కాగా ‘కలర్ ఫోటో’ చిత్రానికి కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించారు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కలర్ ఫోటో’ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి.