లీక్డ్ పిక్: ఆయనెవరో గుర్తు పట్టగలరా?

0

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే ప్రపంచం కళ్లన్నీ అటువైపే ఉంటాయి. అయితే ఏడాది కాలంగా అమీర్ నటించిన సినిమా ఏదీ రాకపోవడంతో ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ గత ఏడాది నవంబర్ లో రిలీజైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ భారీ చిత్రం ఫెయిల్యూర్ తర్వాత అమీర్ ఎంతో ఆచితూచి అడుగులేశాడు. ఆ కోవలోనే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ లో నటించేందుకు చాలానే హార్డ్ వర్క్ చేశాడు. ప్రీప్రొడక్షన్ కోసమే ఏడెనిమిది నెలల సమయం తీసుకుని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అసలు 2019లో అమీర్ సినిమా ఏదీ రాకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న సందర్భమిది.

తాజాగా అమీర్ నటిస్తున్న సినిమాకి సంబంధించి లుక్ ఒకటి అంతర్జాలంలోకి లీకైంది. ఈ లీక్డ్ ఫోటోలో అమీర్ గుర్తు పట్టలేనంత కొత్తగా కనిపిస్తున్నాడు. పూర్తిగా గుబురుగడ్డం తలపాగాతో శిక్కు గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు. పైగా మొల దాటి పొట్ట పైవరకూ తొడుక్కున్న ఫార్మల్ ఫ్యాంట్ .. టక్కు టిక్కు.. బ్రౌన్ షూస్.. ఈ గెటప్ చూస్తుంటే వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రతిసారీ అమీర్ నుంచి ఏదో ఒక కొత్తదనం ఆశించే అభిమానులకు ఇది నిజంగానే సర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పాలి. ఈ చిత్రంలో సర్ధార్ అనే పాత్రలో నటిస్తున్నారు. లాల్ సింగ్ ఛద్ధా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. శిక్కులు ఎక్కువగా ఉండే ఛండీఘర్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

అమీర్ న్యూలుక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు గుర్తు పట్టలేకపోతున్నాం! అంటూ చాలా మంది అభిమానులు సర్ ప్రైజ్ అవుతుంటే.. సర్ధార్ జీ లుక్ లో ఎంతో అందంగా ఉన్నారంటూ అమీర్ ని పొగిడేస్తున్నారు కొందరు. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా నటిస్తోంది. 2020 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Please Read Disclaimer