రౌడీ హీరోయిన్ కి లీగల్ ట్రబుల్స్

0

షాలిని పాండే.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారి పోయింది. ఆమె నటించిన `అర్జున్రెడ్డి` ఓ గేమ్ ఛేంజర్. ఈ సినిమానే తన కెరీర్ని మలుపుతిప్పింది. తెలుగు- తమిళ భాషల్లో క్రేజీ ఆఫర్లని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో `ఇద్దరి లోకం ఒకటే.. అనుష్క తో కలిసి బహుభాషా చిత్రం `నిశ్శబ్దం`లోనూ నటిస్తోంది. వీటితో పాటు షాలిని పాండే కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా షాలిని బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ హైపర్ హీరో రణ్ వీర్ సింగ్ `జయేష్ భాయ్ జోర్ దార్` పేరు తో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. దివ్యాంగ్ టక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా షాలిని పాండే బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో రణ్ వీర్ కు జోడీగా షాలినికి అవకాశం లభించింది. ఇదిలా వుంటే ఆమె పై క్రిమినల్ కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలోనూ ఇటీవల సినిమాలు చేసిన షాలిని పాండే అక్కడ మరో చిత్రాన్ని అంగీకరించిందట. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా `అగ్ని సిరగుగల్` పేరుతో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేశారు. నవీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అరుణ్ విజయ్ కీలక పాత్ర లో నటించనున్న ఈ సినిమాని షాలిని పాండే అంగీకరించి కొంత మొత్తం తీసుకుందట. అయితే షూటింగ్ మాత్రం ఏడు రోజులే చేసి ఆ తరువాత నుంచి తప్పించుకుని తిరుగుతోందట. చేసేది లేక చిత్ర యూనిట్ షాలిని స్థానంలో అక్షరా హాసన్ ని తీసుకుని షూటింగ్ మొదలుపెట్టారట. తమని నమ్మించి మోసం చేసినందుకు గానూ షాలిని స్వయంగా వివరణ ఇవ్వాల్సి వుంది.
Please Read Disclaimer