నిలకడగా లతా మంగేష్కర్ ఆరోగ్యం

0

ప్రముఖ వెటరన్ గాయని లతా మంగేష్కర్ ఇటీవల ఐసీయు లో చికిత్స పొందుతున్నారన్న వార్త తో అభిమానులు కలవర పాటుకు గురయ్యారు. అస్వస్థత తో ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పిటల్ లో చేరిన లతాజీ ఆరోగ్యం నిలకడ గా ఉందని తాజాగా సమాచారం అందింది. ఇంతకు ముందు ఐసీయులో లతాజీకి చికిత్స అందించగా తన ఆరోగ్యం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. లతాజీ ఆరోగ్యం విషయం లో పుకార్లు సృష్టించ వద్దని కుటుంబ సభ్యులు తాజా ప్రకటన లో విజ్ఞప్తి చేసారు. “లతా దీదీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె కోలుకుంటున్నారు“ అంటూ లతాజీ అధికరిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన వెలువడడంతో అభిమానులు స్థిమిత పడ్డారు.

లతాజీ కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఆ క్రమం లోనే బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి లో వెంటిలేటర్ పై చికిత్స అందించారని కుటుంబీకులు వెల్లడించారు. డా.పతీత్ సంధానీ నేత్రుత్వం లోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియా- గుండె సంబంధిత సమస్యలు- ఛాతీ ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతున్నాయి. అయినా చికిత్స అనంతరం కోలుకుంటున్నారని తాజాగా ఆస్పత్రి వర్గాలు.. కుటుంబ సభ్యులు విడివిడి గా ప్రకటనలు జారీ చేశారు.

90 ఏళ్ల జీవితంలో 70 ఏళ్లు కేవలం పాటకే అంకితమయ్యారు లతాజీ. తనదైన గానాలాపనలోనే జీవించారు. గానకోకిల గా కెరీర్లో 1000 పైగా పాటలు ఆలాపించి పాటల పూదోటలో విరబూసిన మధుర గాయనిగా నిలిచారు. సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సుస్వరాలు ఆ గొంతు నుంచి జాలువారాయి. ఏ ఇతర గాయనీ మణికి అయినా గొప్ప ఆదర్శం. దాదాసాహెబ్ ఫాల్కే సహా భారతరత్న పురస్కారం అందుకున్నారు. ప్యార్ కర్నా తో డర్నా కియా (మొఘల్ ఏ అజమ్) అజీబ్ దస్తాన్ హై యే (దిల్ ఆప్నా ఔర్ ప్రీత్ పారై).. రంగీలా రే (ప్రీత్ పుజారీ).. జియ జలే (దిల్ సే).. ఇవన్నీ లతాజీ ఆలపించిన మరపురాని గొప్ప పాటలు. వృత్తికి అంకితమై పని చేస్తే విజయాలు పతాక స్థాయిలో అందుకోవచ్చని నిరూపించిన మేటి గాయనీమణి లతాజీ.
Please Read Disclaimer