సరిలేరు నీకెవ్వరుకు నాపేరు సూర్య లింక్..?

0

అదుపులో లేని కోపం.. కట్టలు తెంచుకునే క్రోధం ఉండే హీరో పాత్ర. ఇలాంటి యాంగర్ ఇష్యూస్ తో హీరోకు వచ్చే ఇబ్బందులు.. యాంగర్ మేనేజ్మెంట్ చుట్టూ అల్లుకున్న కథలపై ఈమధ్య ఫిలిం మేకర్స్ దృష్టి సారించారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్రనే పోషించి అందరినీ మెప్పించారు. ఇక అల్లు అర్జున్ కూడా ‘నాపేరు సూర్య’ లో కోపం ఏమాత్రం అదుపులో ఉంచుకోలేని మిలిటరీ ఆఫీసర్ గా కనిపించారు. సినిమా హిట్ కాలేదు కానీ అల్లు అర్జున్ పాత్ర మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో మహేష్ పాత్ర స్వభావంలో ఇవే ఛాయలు ఉంటాయని సమాచారం.

‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ పాత్రకు విపరీతమైన కోపంతో ఉంటుందట. అన్యాయం.. అక్రమం అనే పదాలు వినిపిస్తే మహేష్ లోపల ఉండే నరసింహావతారం బయటకు వచ్చేస్తుందట. మహేష్ కోపం భరించలేక మహేష్ ను బోర్డర్ కు పంపేస్తారట. అక్కడ శత్రువుల తాట తీసే కార్యక్రమం పూర్తయిన తర్వాత మహేష్ తిరిగి వస్తాడు. అయితే ఇక్కడ జరిగే అన్యాయాలను ఎదురించి విలన్స్ భారతం పట్టే మిషన్ మొదలుపెడతారట. ఒకవైపు శత్రుదేశాల నుంచి భారతదేశ ప్రజలను రక్షిస్తూ సరిహద్దులో ప్రాణాలకు తెగించి మరీ మిలిటరీ వారు పోరాడుతూ ఉంటే ఇక్కడ మీరు ఒకరిలో ఒకరు కొట్టుకు చస్తారా.. అలా చేస్తే సైనికుల ప్రాణత్యాగాలకు అర్థం ఉండదని చెప్పే థీమ్ తో ఈ సినిమా తెరకెక్కిందని టాక్ ఉంది.

అయితే మహేష్ యాంగ్రీ మ్యాన్ తరహాలో కనిపించినా సినిమా మాత్రం ఫుల్ కామెడీతో సరదాగా లైటర్ వెయిన్ లో సాగుతుందట. ఏదేమైనా మహేష్ ను ఇలా యాంగ్రీ మ్యాన్ తరహాలో చూడడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమే. ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న ట్రైలర్లో మహేష్ పాత్రకు సంబంధించిన శాంపిల్ ఉంటుంది కాబట్టి మహేష్ పాత్రపై ప్రేక్షకులకు కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer