ఆ హీరోయిన్ 9 నెలల గర్భిణి

0

బాలీవుడ్ సెలబ్రిటీల బేబి బంప్ ప్రదర్శన నిరంతరం చూస్తున్నదే. ఎమీజాక్సన్- సమీరా రెడ్డి లాంటి భామలు ఇటీవల బేబి బంప్ (గర్భం) ప్రదర్శనతో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో డజన్ పైగా టాప్ హీరోయిన్స్ ఈ తరహాలో బేబి బంప్ ని ప్రదర్శించి వార్తలకెక్కారు.

గత కొంతకాలంగా టాప్ మోడల్ కం హీరోయిన్ లీసా హెడెన్ బేబి బంప్ ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. లీసా ఇప్పుడు కీలక ఘడియలో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మరోసారి బేబి బంప్ ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. “తొమ్మిది నెలల గర్భం ఇది… ఎనీ డే నవ్ ..“ అనే వ్యాఖ్యను జోడించింది. ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం తనకు కొత్తేమీ కాదు. బికినీ ఫోటోలు.. సన్ బాత్ ఫోటోలు.. గర్భం ధరించిన ఫోటోలు.. ప్రతిదీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేస్తూనే ఉంటుంది.

లీసా హెడెన్- డినో లల్వాణీ జంటకు రెండో బిడ్డ జన్మించనుంది. ఇప్పటికే ఈ జోడీకి జాక్ అనే కొడుకు ఉన్నాడు. ఇంతకుముందు తన కుమారుడు జాక్ తో ఉన్న ఫోటోని లీసా షేర్ చేసి దానికి ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. త్వరలో వీడితో పాటు మరొక ఏంజల్ కనిపించబోతున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక రెగ్యులర్ గా తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫ్రెగ్నెన్సీ సంగతుల్ని లీసా అభిమానులకు రివీల్ చేస్తూనే ఉంది. తన వర్కవుట్ ఫోటోల్ని ఇంతకుముందు ఒక సిరీస్ తరహాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer