లీసా 2.0 బేబి బంప్

0

సడెన్ పెళ్లితో షాకిచ్చిన బోల్డ్ బ్యూటీస్ జాబితాలో లీసా హెడెన్ పేరు కూడా ఉంది. బ్రిటన్ వ్యాపారవేత్త డినో లల్వానితో చాలాకాలం ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు ఇతర భామల్లానే తెలివిగా ఆలోచించింది. బిజినెస్ మేన్ ని రహస్య వివాహం చేసుకుంది. అటుపై ఈ జంట విదేశీ విహారాలు.. బికినీ బీచ్ వ్యవహారాలు తెలిసిందే. ఇటీవలే లాక్మే ఫ్యాషన్ వీక్ లో తళుక్కున మెరిసింది. ఇక ఇప్పటికే లీసా ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది.

అందుకు సంబంధించిన ఓ ఫోటోని సమాజిక మాధ్యమాల్లో రివీల్ చేసింది. బేబి బంప్ ఫోటో ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది. బేబి బంప్ ఎగ్జిబిషన్ అండ్ ఎలివేషన్ అన్నది లేటెస్ట్ ట్రెండ్. ఇంతకుముందు సమీరారెడ్డి.. బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ 2.0 తరహాలోనే లీసా కూడా బేబి బంప్ కి సంబంధించిన వ్యవహారాల్ని అభిమానులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. బేబి బంప్ ఉన్నా.. ఇదిగో ఇక్కడ ఇలా తనకు నచ్చిన హెల్దీ సలాడ్స్ వగైరా లాగించేస్తూ ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటో వెబ్ లో వైరల్ గా మారింది.

చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా.. రామ్ చరణ్ రచ్చ సినిమా టైటిల్ సాంగులో ఇచ్చిన స్పెషల్ ఎంట్రీ మర్చిపోలేరు అభిమానులు. ఆ తర్వాత మాత్రం కెరీర్ పరంగా రేసులో వెనకబడింది. వ్యక్తిగత జీవితానికే అంకితమైంది. 247 వైన్ గ్లాసుల సాక్షిగా.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ అమ్మడు పెళ్లాడింది.
Please Read Disclaimer