రానా లో ఈ ట్యాలెంట్ కూడా ఉందే

0

విశాల్ తమిళం మరియు తెలుగు సినీ ఇండస్ట్రీ లో రాణిస్తూ వస్తున్నాడు. తమిళంలో ఈయన చేసిన ప్రతి సినిమా ను కూడా తెలుగు లో విడుదల చేస్తున్నారు. విశాల్ నటించి డబ్బింగ్ అయిన పలు సినిమాలు తెలుగు లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి చాలా విభిన్నం గా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విశాల్ నటించాడు. ‘యాక్షన్’ అనే టైటిల్ తో రూపొందిన ఆ చిత్రంను తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. తమిళం లో ప్రమోషనల్ సాంగ్ ను అక్కడ స్టార్ హీరో అయిన ఆది పినిశెట్టి పాడగా తెలుగు లో మాత్రం యువ హీరో రానా పాడాడు. రెండు మూడు రోజుల ముందే విశాల్ ఈ విషయాన్ని అధికారికం గా ప్రకటించాడు. నేడు ఆ పాటను విడుదల చేశారు. పాట విన్న తర్వాత ఇది విశాల్ పాడిన పాటేనా అనే అనుమానం వస్తుంది. కాస్త దృష్టి పెట్టి వింటే అప్పుడు రానా అనిపిస్తుంది.

రానా పాట తో యాక్షన్ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ పాట మేకింగ్ వీడియో తో పాటు సినిమా మేకింగ్ షాట్స్ ను విడుదల చేశారు. పాట కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చాలా స్పీడ్ గా ఏమాత్రం తడ బడకుండా జాగ్రత్తగా రానా పాడాడు. రానా లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. హీరో గానే కాకుండా ముందు ముందు ఇక పై సింగర్ గా కూడా కనిపించే అవకాశం ఉంది. రానా భవిష్యత్తు లో తన సినిమాల కు తానే పాటలు పాడుకుంటాడేమో చూడాలి. త్వరలో రానా విరాట పర్వం చిత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
Please Read Disclaimer