ఎన్టీఆర్ ట్రైనర్ సూచనలు పాటిస్తున్న ప్రభాస్

0

ఒకప్పుడు హీరోలు బాడీ షేపింగ్స్ గురించి ఎక్కువగా శ్రద్ద చూపించేవారు కాదు. బరువు పెరగకుండా ఉండేందుకు మాత్రమే ప్రయత్నించేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా తమ బాడీ షేపింగ్స్ పై దృష్టి పెడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా వ్యక్తిగా ట్రైనర్స్ ను పెట్టుకుంటున్నారు. కొందరైతే హాలీవుడ్ ట్రైనర్స్ ఆద్వర్యంలో కూడా వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. అరవింద సమేత చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రముఖ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో జిమ్ చేసిన విషయం తెల్సిందే.

అరవింద సమే చిత్రంలో ఎన్టీఆర్ ఫిజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయంటూ ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు కూడా జిమ్ ట్రైనర్ గా లాయిడ్ స్టీవెన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. జక్కన్న ఈయన వర్క్ పై చాలా సంతృప్తిగా ఉన్నాడట. చరణ్ మరియు ఎన్టీఆర్ లను తాను అనుకున్నట్లుగా చేశాడంటూ రాజమౌళి అన్నాడట. ఇప్పుడు స్టీవెన్స్ సలహాలు మరియు సూచనలను ప్రభాస్ తీసుకుంటున్నాడట.

బాహుబలి చిత్రం కోసం బరువు పెరిగిన ప్రభాస్ ఆ తర్వాత సాహో చిత్రం కోసం తగ్గాడు. దాదాపుగా 8 కేజీల బరువును తగ్గినట్లుగా గతంలో ప్రభాస్ చెప్పాడు. బరువు తగ్గడంతో ప్రభాస్ మొహంలో గ్లో పోయిందని కొందరు కామెంట్స్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా కాస్త ఆ ఫీలింగ్ ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. దాంతో ప్రభాస్ తన బాడీ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుని లాయిడ్ స్టీవెన్స్ ను అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జాన్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెల్సిందే. జాన్ చిత్రంలో ప్రభాస్ చాలా విభిన్నంగా కనిపించడం ఖాయం అంటూ ఆయన ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. వచ్చే వేసవిలో జాన్ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer