డార్లింగ్ ట్రెయినింగ్ పుకారు అంటున్నారే!

0

డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ ఫిట్ గా ఉంటాడు కానీ గత కొంతకాలంగా బరువు పెరిగాడు. కొత్త సినిమా ‘జాన్’ కోసం అలా పెరిగాడని అనుకున్నారు కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అదేమీ లేదని తేలిపోయింది. అయితే ఈమధ్య ‘మత్తువదలరా’ టీమ్ ను కలిసిన సమయంలో ప్రభాస్ తన ఫిట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో డార్లింగ్ మళ్లీ తన ఫిట్నెస్ పై దృష్టి సారించాడని అందరికీ అర్థం అయింది.

ప్రభాస్ గత కొన్ని రోజులుగా ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రెయినర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎక్సర్ సైజులు చేస్తూ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఉన్నాడని వార్తలు వచ్చాయి. గతంలో లాయిడ్ స్టీవెన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫిట్నెస్ ట్రెయినర్ గా వ్యవహరించారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు ముందు ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ అవతారంతో ఎన్టీఆర్ అందరినీ మెప్పించడం వెనక లాయిడ్ స్టీవెన్స్ ఉన్నారు. దీంతో ప్రభాస్ మేకోవర్ వెనుక కూడా ఆయన ఉండొచ్చని చాలామంది నమ్మారు. కానీ లాయిడ్ స్టీవెన్స్ మాత్రం అది జస్ట్ పుకారే అంటున్నారు.

ప్రభాస్ కు ట్రెయినింగ్ వార్తలపై స్పందించిన లాయిడ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ “మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. అయితే ఇది నిజం కాదు. ఈ పుకారు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీ అందరికీ ఈ నూతన సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ కు ట్రెయినింగ్ ఇస్తున్నారన్నది పుకారు అని తేలిపోయింది. ఇదిలా ఉంటే లాయిడ్ స్టీవెన్స్ ప్రస్తుతం ‘RRR’ హీరోలు ఎన్టీఆర్.. చరణ్ ఇద్దరికీ ఫిట్నెస్ ట్రెయినర్ గా వ్యవహరిస్తున్నారు.
Please Read Disclaimer