అను..శేఖర్ మాస్టర్ ల రొమాన్స్

0

జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ముద్దుగుమ్మ అనసూయ ఒకటికి మూడు చేతుల సంపాదిస్తుంది. పలు రియాల్టీ షోలతో పాటు సినిమాల్లో కూడా ఈ అమ్మడు ఒక రేంజ్ లో ఊపు ఊపేస్తోంది. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్స్ షో లో కూడా చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ షో కోసం శేఖర్ మాస్టర్ తో వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిన్నిలా నిన్నిలా అంటూ సాగే పాటకు వీరిద్దరు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. పసుపు పచ్చని చీర.. తెల్లని బ్లౌజ్ లో అనసూయ మెరిసి పోతూ శేఖర్ మాస్టర్ తో స్టెప్పులు వేస్తూ ఉంటే ప్రేక్షకులు చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు గతంలో కూడా పలు సార్లు స్టేజ్ పై డాన్స్ లు చేశారు. కాని ఈసారి మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లోకల్ గ్యాంగ్స్ కు తన అందంగా హైప్ తీసుకు వచ్చేందుకు అనసూయ ప్రయత్నాలు చేస్తుంది. ప్రదీప్.. రవి.. శేఖర్ మాస్టర్ లు ఈ షోను హైలైట్ అయ్యేలా చేస్తున్నారు. జీ తెలుగులో ప్రతి శనివారం 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంను చాలా మంది అనసూయ కోసం చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-