ట్రైలర్ టాక్: ‘లోల్ సలామ్’

0

ఓటిటిలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో.. అప్పటినుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకర్స్ – నటినటులు – టెక్నీషియన్స్ ఇలా కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఓటిటి వేదికగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లకు కొదవలేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తున్నాయి. తాజాగా అలాంటి న్యూ టీమ్ ఒకటి పూర్తి వినోదంతో కూడిన వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ‘లోల్ సలామ్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ ఫన్ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా టాలీవుడ్ హీరో నాని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసాడు.

అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు. అయితే ఈ లోల్ సలామ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ జీ5లో జూన్ 25నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన స్నేహితుల బృందం కారులో హాలీడే ట్రిప్ బయలుదేరతారు. అయితే ఓ అడవి మార్గం మధ్యలో ఆ కారు చెడిపోతుంది. ఆ టైంలో స్నేహితులు అటు ఇటు తిరుగుతుండగా.. వారిలో ఒకడు ల్యాండ్ మైన్ మీద కాలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతోంది.

అయితే వెబ్ సిరీస్ పూర్తిగా ఫన్నీ కన్వర్సేషన్ తో నడుస్తుంది. యువదర్శకుడు నాని – పూర్తిగా కొత్తవాళ్ళతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఐదుగురు కొత్తగా లీడ్ రోల్స్ తో పాటు 40మంది న్యూ ఆర్టిస్ట్ లను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన తారాగణం చూస్తే.. భరద్వాజ్ (జాన్) శ్రీనివాస్ రెడ్డి (ఖాన్) దరాహాస్ మాథుర్ (నాయుడు) కివిష్ కౌటిల్య (రెడ్డి) రోహిత్ కృష్ణ వర్మ (వర్మ) పవన్ కుమార్ (బాబాయి) పద్మిని సెట్తం (సహస్యా) ప్రవీణ (సుప్రాజా) గాయత్రి (స్వర్ణ) ఐశ్వర్య బాలా కనిపించనున్నారు. రాకేష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ కాగా అజయ్ అరసాదా సంగీతం అందిస్తున్నాడు. వెంకటకృష్ణ ఎడిటర్ గా పరిచయం కాబోతున్నాడు.

ట్రైలర్ చూస్తే చాలా ఫన్నీగా పూర్తి హాస్యపూరిత సన్నివేశాలు పుస్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మాటలు కూడా చాలా నేచురల్ గా ఉండటం విశేషం. చూడాలి మరి జూన్ 25న లోల్ సలామ్ వెబ్ సిరీస్ ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తుందో..!