మీకు మాత్రమే చెప్తా.. బయ్యర్లకు నష్టం తప్పదా?

0

కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 1 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్.. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్స్ కూడా నిరాశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.

హీరో హీరోయిన్లు ఎవరో ప్రేక్షకులకు తెలియకపోవడం కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపించింది. ఈ సినిమాకు కనీసమాత్రం ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా రాలేదని.. అందుకే ఎక్కడ కూడా కలెక్షన్ ఫిగర్స్ కనిపించడం లేదని సమాచారం. న్యూ జెనరేషన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తీసిన యూత్ ఫిలిం ఇది. దీంతో బీ.. సీ సెంటర్లలో ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కలేదని అంటున్నారు. కలెక్షన్స్ సరిగా రాకపోవడంతో ఈ సినిమాను విజయ్ దేవరకొండను చూసి కొన్న బయ్యర్లు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారట. ముఖ్యంగా ఆంధ్రా.. సీడెడ్ లోని బయ్యర్లకు నష్టం ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.

నిజానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అటూ ఇటుగా అమ్ముడుపోయాయి. నిజానికి ఈ ఫిగర్ మరీ పెద్దదేమీ కాదు. విజయ్ దేవరకొండ క్రేజ్.. యూత్ సెంట్రిక్ ఫిలిం కావడంతో ఈ మాత్రం కలెక్షన్స్ సునాయాసంగా వచ్చేస్తాయని బయ్యర్లు వేసుకున్న అంచనా తప్పిందని.. ఊహించని విధంగా బయ్యర్లు నష్టాలపాలవుతున్నారని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer