డిఫరెంట్ మెలోడీతో వచ్చిన డార్లింగ్

0

సుజిత్ దర్శకత్వంలోప్రభాస్ – శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. టీజర్ ట్రైలర్లతో పాటుగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సైకో సయ్యా’ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. తాజగా ఈ సినిమా నుండి ‘ఏ చోట నువ్వున్నా’ అంటూ సాగే మరో రొమాంటిక్ పాట టీజర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో పాటలకు ఒక్కరే కాకుండా వేరే వేరే సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న సంగతి తెల్సిందే. మొదటి పాటకు తనిష్క్ బాగ్చి సంగీతం అందించగా.. ఏ చోట నువ్వున్నా పాటకు గురు రాంధ్వా సంగీతం అందించారు. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్. పాడినవారు హరిచరణ్ శేషాద్రి.. తులసి కుమార్. “నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే.. నీ కన్నులు అలిసేలా నీక్కనిపిస్తాలే” అంటూ లిరిక్స్ చాలా సింపుల్ పదాలతో అందరూ హమ్ చేసుకునేలా ఉన్నాయి. ట్యూన్ కూడా సాఫ్ట్ మెలోడీలా డిఫరెంట్ ఇన్ స్ట్రుమెంటేషన్ తో సాగింది. పాట రొమాంటిక్ కావడంతో మంచు కొండలు ఉండే ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. లీడ్ పెయిర్ ప్రభాస్.. శ్రద్ధాల దుస్తులు మరింత అందంగా ఉన్నాయి.

పాట మొత్త రిలీజ్ కాలేదు కాబట్టి ఎలా ఉందో టక్కుమని అభిప్రాయం చెప్పలేం. టీజర్ ను చూసి చెప్పాల్సి వస్తే మాత్రం బాగుంది. నాలుగైదు సార్లు వింటే ప్రేక్షకులు ఈ పాట మాయలో పడిపోవడం ఖాయం. ఆలస్యం ఎందుకు.. ‘ఏచోట ఉన్నా’ సాంగ్ టీజర్ చూసేయండి.
Please Read Disclaimer