విడిపోయినా నిను వీడని నీడను నేను!

0

కాసేపు కలిసే ఉన్నామంటారు. ఇంకాసేపు బ్రేకప్ అయ్యిందంటారు. అంతలోనే రెస్టారెంట్ లో కలిసి డిన్నర్ లు.. లంచ్ లు.. వగైరా వగైరా అంటూ సందడి చేస్తారు. ఓసారి చిర్రు బుర్రు లాడుకుంటూ కనిపిస్తారు. మరోసారి ముఖంపై చిరునవ్వులు పులుముకుని జాలీగా కనిపిస్తారు. అసలేమిటో ఈ ప్రేమికుల వాలకం? అసలింతకీ ఏది నిజం? ఇంతకీ టైగర్ ష్రాఫ్ నుంచి లోఫర్ బ్యూటీ దిశా పటానీ విడిపోయినట్టేనా.. లేదూ ఇంకా లవ్ లో ఉన్నట్టా? ప్చ్.. ఏదీ క్లారిటీ లేదు.

కలిసి ఉంటారు.. విడిపోతారు.. కలుస్తారు.. అదంతే!! అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలిసి విడిపోయినా విడిపోయి కలిసి ఉన్నా ఒకటేనని అనుకోవాలి. నిన్నగాక మొన్న బ్రేకప్ అయిపోయింది ఇక కలవరు! అంటూ ప్రచారం సాగింది. ఈలోగానే ముంబైలోని ఓ పాపులర్ హోటల్ నుంచి ఇద్దరూ నవ్వులు చిందిస్తూ బయట కనిపించారు. కారెక్కి వెళుతూ కనిపించి పెద్ద షాకిచ్చారు. మొన్న బ్రేకప్ సమయంలోనూ ఇలా హోటల్లో మీటింగులు పెట్టుకున్నారని.. కలిసి లంచ్ చేశారని ముంబై మీడియా కోడై కూసింది.

ఎంతైనా మోడ్రన్ కపుల్ కదా.. విడిపోవడం కూడా అంతే మోడ్రన్ గానే ఉంటుందని వేరే చెప్పాలా? అయితే ఈ ఇద్దరూ విడిపోయినా కలిసి పార్టీలు చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారా? ఏమో కానీ మొత్తానికి ఎంతో మెచ్యూర్డ్ గానే ఉందీ డీల్. విడిపోయినా నిను వీడని నీడను నేను! అంటూ టైగర్ ఇదిగో ఇలా వెంటాడుతున్నాడు. అది సరే.. కలిసి డిన్నర్ లకు వెళ్లడాలు.. కలిసి నటించడాలు ఉంటాయి కాబట్టి కెరీర్ పరంగానూ ఇబ్బందేమీ ఉండదు. ఇద్దరి మధ్యా స్నేహం చెడింది.. రీసెంటుగానే బ్రేకప్ అయ్యింది! అంటూ బ్రేకింగ్ న్యూస్ లు చెబుతున్న బాలీవుడ్ మీడియాకే దిమ్మ తిరిగే ట్రీటిస్తోందీ జోడీ. టైగర్ – దిశా సంథింగ్ స్పెషల్ అనే అనుకోవాలా!

Comments are closed.