కాలం పరిగెడుతున్నా ప్రేమ పెరుగుతూనే ఉంది

0

అల్లు అర్జున్.. స్నేహారెడ్డిల పెళ్లి రోజు నేడు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో తప్పకుండా టైంను స్పెండ్ చేస్తూనే ఉంటాడు. భార్య పిల్లలతో అల్లు అర్జున్ గడిపే ఎంజాయ్ మూమెంట్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. నేడు పెళ్లి రోజు సందర్బంగా బన్నీ సింపుల్ గా తన ప్రేమను చూపించాడు.

పెళ్లి ఫొటోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్ ఫొటో కింద పెళ్లి అయ్యి 9 ఏళ్లు అయ్యింది. సమయం చాలా స్పీడ్ గా అయిపోయింది. కాని ప్రేమ మాత్రం ప్రతి రోజు పెరుగుతూనే ఉందంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కు భార్య స్నేహారెడ్డిపై ఉన్న ప్రేమ ఈ పోస్ట్ తో తెలుస్తుందని నెటిజన్స్ అంటున్నారు. బన్నీని పెళ్లి చేసుకున్నందుకు స్నేహ లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్ ను 8 లక్షల మంది లైక్ చేశారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే మొన్న సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే ఏడాది చివరి వరకు ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-