‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ ట్రైలర్

0

నేటితరం ఆలోచనలకు తగ్గట్లు రూపొందే చిత్రాలకు ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. అందుకే మేకర్స్ అందరూ అలాంటి సినిమాలు తీయడానికి వెనకాడటం లేదు. లిమిటెడ్ బడ్జెట్ తో యూత్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం చిన్న సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని బోల్డ్ గా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో నేటి ట్రెండ్ కు అద్దం పట్టే అంశాలతో ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ సినిమా తెరకెక్కింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబడింది. జయంతి గాలి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ సినిమా ద్వారా కార్తిక్ బిమల్ – సంచిత పొనాచ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

కాగా ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ సినిమా ట్రైలర్ హీరో దగ్గుబాటి రానా విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఈ జెనరేషన్ యువతీయువకులు పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నలతో ఒక రిలేషన్ కి కమిట్ అవడానికి ఎలాంటి కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు అనే నేపథ్యంలో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. లెట్స్ మేక్ లవ్.. నో కమిట్ మెంట్స్.. నో బుల్ షిట్స్.. లెట్స్ కీపిట్ సింపుల్.. మాది ప్రేమ కాదు ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది.. నీ లవర్ పదహారళ్లకే పక్కింటి ఆంటీతో.. అయితే ఏంటంట? అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ యువతను ఆకర్షించేలా ఉంది. ”నీకు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీ ఫాదర్ మాత్రం కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చొని.. నిన్ను నీ ఫ్యామిలీ లైఫ్ ని చూస్తూ మిగతా జీవితాన్ని గడిపెయ్యాలి అంతేనా?” అంటూ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చెప్పబోతున్నారనే ఆసక్తిని కలిగిస్తోంది. ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.Please Read Disclaimer