కరోనాతో ఈ బ్యూటీకి లక్ కలిసి వచ్చినట్లుంది

0

టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయి మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలను కూడా డేట్లు లేవు అంటూ కాదనుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలో ఎక్కువ మంది స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈ అమ్మడి అదృష్టం మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఒక్కసారిగా ఈమెకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈమెకు అరకొర ఆఫర్లు తప్ప ఎక్కువ ఆఫర్లు వచ్చిన దాఖలాలు లేవు. కరోనాతో ఈ అమ్మడు పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయం అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఒక వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లతో ఈఅమ్మడు రచ్చ చేస్తోంది. తెలుగులో ఈమె వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ రూపొందించబోతున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మరో వైపు నితిన్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే ఒక ప్రముఖ స్టార్ ఫిల్మ్ మేకర్ చేస్తున్న వెబ్ సిరీస్ లో ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్ని ఒక ఎత్తు అయితే కరణం మల్లేశ్వరి సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

అదే కనుక జరిగితే ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవ్వడం ఖాయం. కోలీవుడ్ లో కూడా ఈమె ఒకటి రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉందని అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి కరోనా వల్ల అమ్మడికి అనూహ్యంగా లక్ కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. ఈ లక్ మళ్లీ ఎంత కాలం కొనసాగేనో చూడాలి.