నాని గ్యాంగ్ లీడర్ ఛాన్స్ కొట్టేసినట్టేనా ?

0

వచ్చే నెల 13 విడుదలకు అంతా రెడీ చేసుకున్న నాని గ్యాంగ్ లీడర్ రేపు ట్రైలర్ రిలీజ్ తో స్పీడ్ పెంచనుంది. ఇప్పుడంతా సాహో ఫీవర్ నడుస్తోంది కాబట్టి అది కాస్త తగ్గాక కొత్త తరహ పబ్లిసిటీని ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా అదే రోజు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న వరుణ్ తేజ్ వాల్మీకి మరో వారం వాయిదా పడి 20న వచ్చే అవకాశాల గురించి ఇప్పటికే ఫిలిం నగర్ లో టాక్ జోరుగా ఉంది.

ఒకపక్క టైటిల్ గురించి కుల సంఘాల వివాదం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాకపోవడం ప్రచారం విషయంలో కొంత వెనుకబడినట్టు అనిపించడం లాంటి కారణాల వల్ల వాల్మికి ఇంకో వారం వాయిదా వేయడమే సేఫ్ అనే అభిప్రాయం యూనిట్ లో వ్యక్తమవుతోందట. అందులోనూ కర్ణాటకలో ఒకరోజు ముందు సుదీప్ పెహల్వాన్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అక్కడ వసూళ్ళ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాల్మికి పోటీ పడకపోవడమే ఉత్తమని అక్కడి మెగా ఫ్యాన్స్ అభిప్రాయమట.

ఇదంతా న్యాచురల్ స్టార్ నానికే బాగా కలిసి వస్తుంది. ఒకవేళ వాల్మీకి వాయిదా పడితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సోలో రిలీజ్ దక్కుతుంది. పక్క రాష్ట్రంలో పెహల్వాన్ ఎఫెక్ట్ ఉన్నా అక్కడేమి తనకు బలమైన మార్కెట్ లేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ క్లాసు మాసు అనే తేడా లేకుండా నానికి సింగల్ గ్రౌండ్ లో ఒక్కడే మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చేందుకు ఇంకో రెండు మూడు రోజులు పట్టొచ్చు. విక్రం కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ లో ఆరెక్స్ 100 ఫేం కార్తికేయ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Please Read Disclaimer