లిరికల్ వీడియో: కోకా కోలా పెప్సీ మాస్ మామా

0

విక్టరీ వెంకటేష్- నాగచైతన్య మామ అల్లుళ్లుగా నటించిన చిత్రం `వెంకీ మామ`. రియల్ మామా అల్లుళ్లు తెరపై సందడి చేయబోతున్నారు. డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ ముందు ప్రచారం పీక్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ వేదికగా డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.

తాజాగా నేటి(డిసెంబర్ 4) సాయంత్రం కోకా కోలా పెప్సీ అనే మాస్ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో వెంకీ-పాయల్ జోడీ.. చైతన్య- రాశీ ఖన్నా జోడీ హుషారైన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఇదో మాస్ మాసాలా సాంగ్. థమన్ బీట్ మాస్ కి కిక్కిస్తోందనే చెప్పాలి. మాస్ బీట్ లో మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇక ఈ పాటలో వెంకీ- చైతూ మధ్య కెమిస్ట్రీ గొప్పగానే వర్కవుటైంది. ఇప్పటికే పోస్టర్లు.. టీజర్లలోనే ఆ ఇద్దరి మధ్యా ఫన్.. ఎమోషన్ కంటెంట్ ఎలివేట్ అయ్యింది. ఇప్పుడు ఈ పాటలో మాంచి మసాలా అద్దకం మాస్ ని మైమరిపిస్తోంది.

ఇక అందాల పాయల్.. రాశీ ట్రీట్ మామూలుగా ఉండదని ఈ లిరికల్ వీడియో చెబుతోంది. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ .. బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ సహా ప్రతిదీ ఇంట్రెస్టింగ్.. ఈ పాటకు కాశర్ల శ్యామ్ క్యాచీ లిరిక్ ని అందించారు. అదితి-రమ్య బెహరా- సింహా-హనుమాన్ తదితర బృందం ఆలపించారు.
Please Read Disclaimer