మా ఎలక్షన్స్ గోల

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లొల్లు నెవ్వర్ ఎండింగ్ అన్న తీరుగా రచ్చకెక్కుతూనే ఉంది. అధ్యక్షుడు వీకే నరేష్ తో కీలక సభ్యులు.. ఈసీ సభ్యులకు తొలి నుంచి గొడవలున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ – జీవితలతో నరేష్ వివాదం పెద్ద రచ్చయ్యింది. ఇప్పటికీ అవుతూనే ఉంది. పెద్దల సభలో రాజశేఖర్ ప్రవర్తనపై మండిపడిన చిరంజీవి ప్రభృతులు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇదంతా పాత గొడవ అనుకుంటే.. ఇప్పుడు మరోసారి కొత్త గొడవ మెంటలెక్కిస్తోంది. 900 మంది సభ్యులున్న అతి పెద్ద ఆర్టిస్టుల సంఘం పరువు మర్యాదలు మంటకలిపే చర్యలపై ప్రస్తుతం ఇంటా బయటా హాట్ టాపిక్ గా మారింది.

ఇక బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి మా అధ్యక్షుడు వీకే నరేష్ ని తొలగించి యాక్టివ్ ప్రెసిడెంట్ గా బెనర్జీని ఎన్నుకున్నామని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సడెన్ గా ప్రకటించడంతో అసలేం జరుగుతోంది? అన్న సందిగ్ధత నెలకొంది. అసలు తొలి నుంచి మా గొడవలు చూస్తుంటే ఇదేదో దేశానికి ప్రెసిడెంట్ ఎలక్షన్ గొడవలాగా నానా రచ్చ సాగుతోంది. అసలు వీళ్లలో వీళ్లకే గొడవలేంటో?

తాజా సీన్ చూస్తున్నవాళ్లు… కనీసం పక్కనే ఉన్న సంఘాలు ఎంత యునిటీగా ఉన్నారు అన్నది చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి రా నాయనా అంటూ తీవ్రమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అసలు ఎవరికి పడితే వాళ్లకు కార్డ్స్ .. మెంబర్షిప్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఈ గోల స్టార్ట్ అయ్యింది. కాస్త చూస్కోండి రాజా! అసలుకే సినిమా వాళ్ల పరువు మర్యాదలు అంతంత మాత్రమే. మెగాస్టార్ చెప్పినట్టే ఏదైనా ఉంటే మీలో మీరు చెవిలో చెప్పుకోవాలి కానీ మరీ ఈ రచ్చేమిటి? రచ్చకెక్కి తగువులాడుకోవడం ఏంటి? నరేష్ సెలవు పెట్టాడు అని ఆయన్ని తీసేసి ఇప్పుడు బెనర్జీని ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు .. ఏంటో! అంటూ రకరకాలుగా సూచనలు చేస్తున్నారు.

ఇంతకీ `మా`లో అసలేమైంది?

అసలు అధ్యక్షుడి తొలగింపు వెనక అసలు కారణమేమిటి? అన్నది ఆరాతీస్తే… మా అధ్యక్షులు నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నామని మా ప్రకటించింది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ పరిసరాల్లోని ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు- మెగా స్టార్ చిరంజీవి- మురళీమోహన్ -జయసుధ తో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ- జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్- హేమ -రాజీవ్ కనకాల- శివబాలాజీ – అనితా చౌదరి – జయలక్ష్మి- కరాటే కళ్యాణి- ఏడిద శ్రీరామ్- రవి ప్రకాష్ -టార్జాన్ – పసునూరి శ్రీనివాస్ రాజా రవీంద్ర ఆలీ- సురేష్ కొండేటి -తనీష్- అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-