మథనం- టీజర్ టాక్

0

వైవిధ్యమైన సినిమాలకు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేమ కథలను కూడా రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో అందించేందుకు దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. ఆ కోవలోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నదే మథనం. దీని ట్రైలర్ ఇందాకా సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే రామ్ (శ్రీనివాస సాయి)ఏదో ప్రత్యేకమైన కారణంతో 14 ఏళ్ళ పాటు ఒంటరిగా చీకటి గదిలో జీవితం గడుపుతాడు.

తల్లితండ్రుల(రాజీవ్ కనకాల-సితార)గారాబంలో అల్లారుముద్దుగా పెరిగిన రామ్ అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి(భావన)ని చూస్తాడు రామ్. మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మొదట కాదన్నా రామ్ నిజాయితీ నచ్చి తనూ ఒప్పుకుంటుంది. కానీ ఈలోగా ఈ ఇద్దరి జీవితం కొన్ని అనూహ్యమైన పాత్రలు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవేంటి అనేదే మథనం

టీజర్ లో కథను చెప్పీ చెప్పకుండా చాలా తెలివిగా కట్ చేశారు. లవ్ స్టోరీ వరకు రొటీన్ గానే అనిపించినా హీరో హీరోయిన్ల పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఏదో సస్పెన్స్ ఎలిమెంట్ ని మైంటైన్ చేస్తూనే తర్వాత యాక్షన్ ని జోడించడం అంతా డిఫరెంట్ గా ఉంది. హీరో శ్రీనివాస్ సాయి పాత్రకు తగ్గట్టుగా ఉండగా భావన మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఫీలింగ్ టీజర్ లోనే ఇచ్చేసింది. అజయ్-సితార లాంటి ఒకరికిద్దరు ఆర్టిస్టులను తప్ప ఇంకెవరిని రివీల్ చేయలేదు. రాన్ ఏతాన్ యోహాన్ సంగీతం పిజి విందా ఛాయాగ్రహణం రిచ్ గా ఉన్నాయి. అజయ్ సాయి మణికందన్ దర్శకత్వం కొత్తగా ఉంది. మొత్తానికి అంచనాలు రేపడంలో మిథునం టీమ్ సక్సెస్ అయ్యిందిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home