మ్యాడీ డాడ్ గానా? అక్కలు ఫీలయ్యారు!

0

తమిళనటుడు మాధవన్ అలియాస్ మ్యాడీ ప్రయోగాల గురించి తెలిసిందే. మ్యాడీ తెరపై కనిపిస్తే చాలు ఎగ్జయిట్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. కోలీవుడ్ లో ఎందరు స్టార్ హీరోలు ఉన్నా అందరిలో తాను ఎంతో స్పెషల్ అని నిరూపించిన గ్రేట్ పెర్ఫామర్. అందుకే అగడిని ఏరి కోరి మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ అవకాశాలిచ్చారు. ప్రస్తుతం అతడు తండ్రి పాత్రలో నటించబోతున్నాడన్న రూమర్ వేడెక్కిస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రంలో వరుణ్ కు తండ్రిగా మాధవన్ నటించనున్నాడని ఇటీవల ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. దీంతో మాధవన్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వరుణ్ కు మాధవన్ తండ్రి రోల్ చేయడం ఏమిటి అంటూ ఆయన లేడీ ఫ్యాన్స్ అయితే అవాక్కయ్యారట. మ్యాడీ ఈ డెసిషన్ నిజమా? అంటూ నేరుగా ఆయన ట్విటర్ కే ప్రశ్నలు సంధించారు. ఇక ఈ చిత్రంలో మాధవన్ భార్య పాత్ర లో మేటి సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వినిపించింది.

తాజాగా తనపై వస్తున్న వార్తలపై మాధవన్ స్పందించాడు. “ఆ ప్రచారంలో నిజం లేదు. నేనింకా చిన్న పిల్లాడినే(సరదగా)“ అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం మాధవన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న నిశ్శబ్ధంలో నటిస్తున్నాడు. తెలుగు- హిందీ-తమిళం భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు మాధవన్ పలు తమిళ- హిందీ సినిమాలకు సంతకం చేసాడు.
Please Read Disclaimer