మాధవీలత కు వచ్చిన ఫోన్ కాల్స్ తెలిస్తే షాక్ అవుతారు..

0ఇటీవల పవన్ కళ్యాణ్ ఫై తన అభిప్రాయాన్ని తెలిపి ఒక్కసారిగా సోషల్ మీడియా లో స్టార్ హీరోయిన్ అయిపోయిన నచ్చావులే ఫేమ్ మాధవీలత..తాజాగా తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా కు తెలిపి సంచలనం రేపింది.

హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయం లో ఓ కోఆర్డినేటర్ ఫోన్ చేసి.. సినిమా అవకాశం ఉందని చెప్పాడని.. కానీ దాని కంటే ముందు తామిద్దరం ప్రేవేట్ గా బయటకు వెళ్దామని, వెళ్లి మనం ఒక రాత్రి గడిపితే బాండింగ్ పెరుగుతుందని.. తర్వాత నీ ఫిగర్ గురించి నిర్మాతకు తెలియజేస్తానని.. అలా సినిమాలో నటించే అవకాశం లభిస్తుందని చెప్పినట్లు మాధవి తెలిపింది. ఆ తర్వాత మరో వ్యక్తి తనకు ఫోన్ చేసి రాత్రికి ఫ్రీనా అడిగాడని.. చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించానని.. పోలీస్ కంప్లైంట్ చేస్తాననడంతో ఫోన్ పెట్టేశాడని మరో ఘటన గురించి చెప్పింది.

వీరు మాత్రమే కాదు ఒక నిర్మాత సైతం ఫోన్ చేసి కమిట్మెంట్ ఇస్తావా అని అడిగాడని.. తాను కుదరదు అన్నానని.. సినిమా అవకాశం అడిగినపుడు ఇలాంటివి కామనే కదా అని ఆ నిర్మాత అన్నాడని.. కానీ తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. మొత్తానికి సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తెలుపగా , ఇప్పుడు మాధవీలత కూడా వారి లిస్ట్ లో చేరింది.