లైమ్ లైట్ కోసం అవుట్ డేటెడ్ హీరోయిన్ చీప్ ట్రిక్స్ ప్లే చేసిందా

0

‘నచ్చావులే’.. ‘స్నేహితుడా ‘ ఫేమ్ తెలుగు హీరోయిన్ మాధవి లత ఈరోజు ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తనకు ఆరోగ్యసమస్యలు ఉన్నాయని.. మందులు కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ త్వరలోనే ‘ప్రేమ’ సినిమాలో రేవతి లాగా చనిపోతానని చెప్పింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా తో పాటు సాధారణ మీడియాలో కూడా కలకలం రేగింది.

ఒక హీరోయిన్ ‘నేను చచ్చిపోతా’ అనడం కంటే హాట్ టాపిక్ మరొకటి ఉండదు కదా? దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా మాధవిలత వైపుకు తిరిగింది. నెటిజన్లు కొందరు మాధవిని ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని చెప్పారు. కొందరేమో ఇది పబ్లిసిటీ స్టంట్ అన్నారు. ఈమధ్య మాధవికి సినిమా అవకాశాలు లేవు.. రాజకీయాల్లో పెద్దగా విజయం లభించలేదు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించడానికి.. లైమ్ లైట్ లో ఉండడానికి ఇలా చేసింది అంటూ విమర్శలు చేశారు. మాధవి పోస్ట్ ఒక హాట్ టాపిక్ కావడంతో ఫేస్ బుక్ ఖాతా ద్వారా మరో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

“డియర్ మీడియా.. నామీద మీరు చూపిస్తున్న ప్రేమకు అభిమానానికి కృతజ్ఞతలు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయకండి. నాకు ఆరోగ్యం సరిగా లేదు. అంతే. టాబ్లెట్స్ మంచివి కాదు వాటిని వాడడం నన్ను ఇబ్బంది పెడుతోంది అనేది నా పోస్ట్. దానికి అర్థం మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గిపోతుంది. నాకు మందులపై విరక్తి వచ్చి అలా చెప్పాను. ఫేస్ బుక్ అనేది నాకు కుటుంబం లాంటిది. అందుకే రోజు లాగే నా గురించి నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ నా అభిమానులతో ఫాలోయర్లతో టచ్ లో ఉంటాను. మీరు రిలాక్స్ అవ్వండి. ఇలా అవుతుందని అనుకోలేదు. నా ఆరోగ్య సమస్యలను గురించి క్యాజువల్ గా షేర్ చేసుకున్నాను. నేను మైగ్రెయిన్ తో చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ మీడియా.. దీన్ని ఇంతటితో ఆపండి. థ్యాంక్ యూ.”

అయితే ఈ క్లారిఫికేషన్ పైన కూడా కొందరు నెటిజన్లు చిర్రుబుర్రులాడుతున్నారు. పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో పర్సనల్ విషయాలు.. ఫీలింగ్స్ పంచుకునే సమయంలో సంయమనం పాటించాలని లేకపోతే ఇలాంటి హంగామానే జరుగుతుందని అంటున్నారు.
Please Read Disclaimer