మాధురీ…ఈ లుక్ మాక్కూడా నచ్చింది…!

0

ఒకప్పుడు స్టార్ కథానాయికయిగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అందాల సుందరి మాధురీ దీక్షిత్. సినీ పరిశ్రమలో అందంతో పాటు ప్రతిభ కలిగియున్న అతికొద్ది నటీమణులలో మాధురి దీక్షిత్ ఒకరు. యావత్ భారతదేశాన్ని తన నటనతో ఆమె వైపు చూసేలా చేసుకున్నారు మాధురీ దీక్షిత్. అద్భుతమైన పాత్రల్లో నటించడంతోపాటు ఐటెం సాంగ్లలో కూడా ఇరుగదీశారంటే అతిశయోక్తి కాదు. ఏక్ దో తీన్ అంటూ కుర్రకారును కిర్రెక్కించినా ధక్ ధక్ కర్నే లగా అంటూ ప్రేమికులని ఉర్రూతలూగించినా చోలి కే పీచే క్యా హై అనే పాటతో మాస్ ప్రేక్షకులను మైమరింపించినా దీదీ తేరా దేవర్ దీవానా అంటూ కవ్వించినా అది ఆమెకే చెల్లింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే వివాహం చేసుకొని కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన మాధురీ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్న విషయం తెలిసిందే.

గతేడాది ‘టోటల్ ఢమాల్’ ‘కళంక్’ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. అడపాదడపా చిత్రాలు చేస్తున్న మాధురీ అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఐదు పదుల వయస్సులో కూడా తరగని అందచందాలతో అదరగొడుతోంది. 50 సంవత్సరాలకు పైబడిన మాధురీ టీనేజీ అమ్మాయిలా అందాలతో కనువిందు చేస్తోంది. తన రీఎంట్రీ తర్వాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. తను టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న టైంలో తీసిన ఈ ఫోటో పెట్టి ‘ఐ స్టిల్ లవ్ దిస్ లుక్’ అంటూ కామెంట్ జత చేసింది. ఇంకేముంది ‘మాధురీ…ఈ లుక్ మాక్కూడా నచ్చింది’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-