కూతురు నగ్నంగా షో చేస్తే సమర్ధించిన స్టార్

0

ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న స్టార్ పాప్ సింగర్ మడోనా వారసురాలు లోర్డేస్ లియోన్ తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంచి స్టేజ్ నటిగా ఇప్పటికే లోర్డేస్ పేరు దక్కించుకుంది. అలాగే ఈమె పియానో కూడా బాగా వాయిస్తుందని ప్రముఖులతో ప్రశంసలు దక్కించుకుంది. ఎంతో మందికి ఆదర్శకంగా నిలుస్తున్న లోర్డేస్ ను కొందరు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో తిట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇటీవల లోర్డేస్ లియోన్ అమెరికాలోని ఫ్లోరిడాలో 40 మందితో కలిసి ఒక స్టేజ్ స్కిట్ చేసింది. ఆ స్కిట్ లో అందరు కూడా నగ్నంగా నటించారు. కేవలం లో దుస్తులు అవి కూడా స్కిన్ టోన్ లో దుస్తులు మాత్రమే. దాదాపు పావు గంట పాటు సాగిన ఈ స్కిట్ అందరిని ఆకట్టుకుంది. కాని కొందరు మాత్రం లోర్డేస్ చేసిన పనిపై ఎప్పటిలాగే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన మడోనా కూతురు ఇలా చేయడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

తన కూతురు లోర్డేస్ లియోన్ పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై మడోనా తీవ్రంగా స్పందించింది. నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. తను మంచి ట్యాలెంటెడ్. తనకు హద్దులు లేకుండా తన ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చాను. కాని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ వల్ల ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు గురించి ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది. మరి ఇకపై అయినా లియోన్ పై నెగటివ్ కామెంట్స్ ఆగుతాయేమో చూడాలి.
Please Read Disclaimer