ఈ హీరోయిన్ ను బెదిరించిన మాఫియా.. సీక్రెట్ ఇదే

0

‘అవును’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ పూర్ణ. ఈమె అసలు పేరు.. షమ్మా ఖాసిం. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో సినిమాలు చేసింది. సౌత్ హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు వచ్చాయి. భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా విషయం బయటపడింది. పూర్ణ బెదిరింపు వెనుక పెద్ద మాఫియా ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి.

కేరళకు చెందిన ఈ బ్యూటీ తల్లి తాజాగా ఆ రాష్ట్ర పోలీసులను ఆశ్రయించింది. లక్షల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది.

పూర్ణతోపాటు మరికొంతమందిని కూడా బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ వివాదం వెనుక ఒక పెద్ద మాఫియానే ఉందని పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్ణకు సెక్యూరిటీ పెంచి ఈ కేసును తవ్వి తీస్తున్నారు. చాలా మంది హీరోయిన్లను ఈ మాఫియా బెదిరించినట్టు తెలిసింది.
Please Read Disclaimer