పాపను గోకితే ముంబై మాఫియా కాల్ వచ్చిందట!

0

ఆయనో యువహీరో. చాలా ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఒక హిట్టుతో ఈమధ్యే ఊపిరి పీల్చుకున్నాడు. ఈ హీరోకు మొదటి నుంచి లవర్ బాయ్ అనే పేరుంది. లవర్ బాయ్ అనగానే ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనుకునేరు.. కాదు కాదు. రియల్ లైఫ్ రొమాన్స్.. రియలిస్టిక్ రొమాన్స్. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లతో లవ్వాట ఆడిన అనుభవం ఉంది. సీనియర్ భామలకు కూడా ఈ లవర్ బాయ్ తన వైఫైని ప్రేమతో కనెక్ట్ చేస్తూ ఉంటాడట. ఈమధ్య ఓ హీరోయిన్ కు అలానే తన లవ్ వైఫై కనెక్ట్ చేసేందుకు ట్రై చేశాడట. కానీ పెద్ద షాక్ తగిలిందని సమాచారం.

ఆ హీరోయిన్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుంటే.. మొదట్లో తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తర్వాత అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇదంతా ఒక పార్శ్వం. ఆ హీరోయిన్ కు రజనీకాంత్ బాషా టైపులో మరో యాంగిల్ ఉందట. అదేంటంటే ముంబై మాఫియాతో సన్నిహిత సంబంధాలు. నిజానికి వారి కనుసన్నల్లోనే ఈ భామ ఉంటుందట. రీసెంట్ గానే ఈ భామకు ఖరీదైన ఒక రోల్స్ రాయిస్ కారు రావడం వెనక గుట్టు అదేనట. లవ్ వైవైని కనెక్ట్ చేయడం తప్ప ఈ బాలీవుడ్ మాఫియా కనెక్షన్.. వాటి పాస్ కోడ్ గట్రా తెలియని ఈ మన కుర్రహీరోకు గట్టిగా ఝలక్ తగిలిందట.

ఎంతో సున్నితంగా సుతిమెత్తగా మాఫియా స్టైల్ లో కుర్రహీరోకు వార్నింగ్ ఇచ్చారట. ఆ బ్యూటీని గోకితే కొరివితో తలను గట్టిగా గట్టిగా ఆపకుండా గోక్కున్నట్టేనని మనోడికి తత్త్వం బోధపడిందట. ఈ లవర్ బాయ్ ప్రో యాక్టివ్ నేచర్ పుణ్యామాఅని ఇండస్ట్రీలో మరి కొందరు ప్రేమను ధారాళంగా పంచుతూ తిరిగే లవర్ బాయ్స్ కి కూడా జ్ఞానోదయం అయిందట. నిజమే.. ఓ డోర్ టచ్ చేస్తే ఒకరికి షాక్ కొట్టిందనుకోండి.. మనం ఏం చేస్తాం? దూరంగా ఉంటాం. తెలిసి తెలిసి ఆ డోర్ ను ప్రేమ భావనలతో మూర్ఖంగా ఓపెన్ చెయ్యం కదా.. ఇదీ అంతే.. లేకపోతే మన అంతే!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home