‘మహర్షి’ వెండి తెరపై హిట్.. బుల్లి తెరపై ఫట్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది. దాదాపుగా వంద కోట్లకు పైగా ఈ చిత్రం వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఒకటి రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధ్యం కాకపోయినా ఓవరాల్ గా చూస్తే మహర్షి చిత్రం హిట్ అంటూ టాక్ వచ్చింది. వెండి తెరపైనే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో కూడా మహర్షి చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వారు మహర్షి తో మంచి లాభాలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కాని ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తీసుకున్న జెమిని వారికి మాత్రం షాక్ తగిలింది.

బుల్లి తెరపై ‘మహర్షి’ చిత్రం తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వేశారు. జెమిని టీవీ భారీగా ప్రమోట్ చేసి మరీ సినిమాను ప్రసారం చేసింది. కాని మహర్షి చిత్రం అర్బన్ మరియు రూరల్ కలిపి యావరేజ్ గా 8.4 టీఆర్పీ మాత్రమే వచ్చింది. 15 నుండి 20 మద్యలో టీఆర్పీ రేటింగ్ వస్తుందని ఆశించిన జెమిని వారికి 8.4 టీఆర్పీ రేటింగ్ మింగుడు పడటం లేదట. మహర్షి చిత్రంకు వచ్చిన బజ్ తో ఇతర ఛానెల్స్ తో పోటీ పడి భారీ మొత్తాన్ని కోట్ చేసి మరీ జెమిని టీవీ దక్కించుకుంది.

గతంలో డీజే 21.. జనతా గ్యారేజ్ 20.. రంగస్థలం 19.5 టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకున్నాయి. చిన్న చిత్రాలైన ఫిదా 21.3 మరియు గీత గోవిందం 20.8 టీఆర్పీని సాధించాయి. అలాంటిది మహర్షి మరీ 10 లోపు టీఆర్పీ రేటింగ్ ను పొందడం ఆశ్చర్యంగా ఉంది. పెద్దగా పోటీ లేని సమయంలో మంచి రోజు చూసి మహర్షి చిత్రాన్ని జెమిని ప్రసారం చేసింది. అయినా కూడా ఎక్కువ టీఆర్పీ రేటింగ్ దక్కలేదు.

సినిమా విడుదలై చాలా కాలం అవ్వడంతో పాటు అమెజాన్ లో వచ్చి చాలా రోజులు అయ్యింది. ఇప్పటికే చాలా మంది సినిమాను చూసేయడం వల్ల సినిమాపై జనాల్లో ఆసక్తి పోయింది. అందుకే ప్రేక్షకులు మహర్షిని బుల్లి తెరపై వచ్చినా పట్టించుకోలేదని కొందరు అంటున్నారు.
Please Read Disclaimer