ముసిముసి నవ్వుల మహర్షి ఫ్రెండ్ షిప్

0

మహేష్ బాబు మహర్షి సందడి రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి ఆడియో సింగల్ చోటి చోటి బాతే రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రిన్స్ ఫ్యాన్స్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన కొత్త పోస్టర్ ని టీమ్ రిలీజ్ చేసింది. నిన్న వదిలిన పిక్ సముద్రం ఒడ్డున ముగ్గురు స్నేహితులు అటు వైపు మొహం చూపించి బ్యాక్ షాట్ లో కట్ చేసి లుక్ ని రివీల్ చేయలేదు.

ఇప్పుడు అదేమీ లేకుండా త్రీ ఫ్రెండ్స్ ని చక్కగా ఆవిష్కరించారు. మహేష్ అల్లరి నరేష్ పూజా హెగ్డేలు స్నేహానికి ప్రతిరూపంగా సరదాగా కబుర్లు చెబుతూ నవ్వుతు తుళ్ళుతూ వెళ్తూ ఉండటాన్ని క్యూట్ గా ప్రెజెంట్ చేశారు. మహేష్ నరేష్ ల మధ్య పూజా హెగ్డే ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బాగా కుదిరాయి

సో ఇది కాలేజీ ఎపిసోడ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ సాంగ్ అనే క్లారిటీ వచ్చేసింది. కీలకమైన ఈ భాగం తర్వాత ముగ్గురు విడిపోయి మహర్షి అమెరికా వెళ్ళిపోతాడు. తిరిగి రావడానికి ఈ ముగ్గురిలో ఒకడైన అల్లరి నరేష్ కారణం అవుతాడు. అసలు అది ఎందుకు జరిగింది అనేది తర్వాత మాట్లాడుకునే విషయం కానీ రేపటి నుంచి మహర్షి సంగీత సాగరంలో ఫాన్స్ మునగనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటిదాకా ఈ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే-శ్రీమంతుడు-భరత్ అనే నేను దేనికవే టాప్ మ్యూజికల్ హిట్స్ గా నిలవడంతో మహర్షి మీద కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షికి దిల్ రాజుతో పాటు అశ్వినిదత్ పివిపి ప్రసాద్ లు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు
Please Read Disclaimer