మహర్షి ఫస్ట్ సాంగ్ పోస్టర్ అదిరిందిగా

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ మే 9 న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెడుతున్నారు. ఈ సినిమాను నుండి మొదటి పాటను 29 వ తేదీన విడుదల చేస్తామని సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ‘మహర్షి’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ పాట రిలీజ్ టైమ్ ను మరోసారి కన్ఫామ్ చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా “మహర్షి మ్యూజికల్ జర్నీ మార్చ్ 29 వ తారిఖు ఉదయం 9 గంటల 09 నిముషాలకు స్టార్ట్ అవుతుంది. #ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాట తో మహేష్ బాబు.. పూజా హెగ్డే.. అల్లరి నరేష్ ల ఫ్రెండ్ షిప్ ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవ్వండి. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్.. శ్రీమణి సాహిత్యం.. కే యూ మోహనన్ ఛాయాగ్రహణం” అంటూ ట్వీట్ చేశాడు వంశీ.

ఇక పోస్టర్ గురించి మాట్లాడుకుంటే… సముద్రం ఒడ్డున ఉన్న ఒక పచ్చటి కొండ అంచున మహేష్.. పూజా.. అల్లరి నరేష్ లు నిలబడి ఉన్నారు. మంచు దుప్పటి కప్పుకున్నట్టున్న క్లైమేట్ లో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వేరే వేరే డైరెక్షన్స్ లో సముద్రాన్ని చూస్తూ నిలబడగా వెనక రెండు స్పోర్ట్స్ సైకిల్స్ మాత్రం ఉన్నాయి. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక #ఛోటీ ఛోటీ బాతేన్ పాట ఎలా ఉందో తెలియాలంటే 29 వ తేదీ వరకూ వేచి చూడాలి.
Please Read Disclaimer