పునర్నవి జామ్ చూపించి జండూబాం నాకించేస్తుందట.. అన్నది రాహుల్ కాదండోయ్

0

బిగ్ బాస్ రియాలిటీ షోతో క్రేజీ హీరోయిన్‌గా మారింది పునర్నవి భూపాలం. తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌కు గ్లామర్ టచ్ ఇచ్చిన పునర్నవి భూపాలంకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అమల్లో పెట్టిన నిర్మాతలు పున్నూ నటించిన వరుస సినిమాలను రిలీజ్‌కు లైన్‌లో పెట్టారు.

తాజాగా ఆమె నటించిన ‘సైకిల్’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ ఫేమ్ మహత్‌ రాఘవేంద్ర హీరోగా నటిస్తుండగా.. అతనితో జోడీ కట్టింది పునర్నవి. ఈ చిత్రానికి ఆట్ల అర్జున్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

‘దురదృష్ణవంతుడి లాటరీని.. అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు’ అంటూ ఫన్నీగా మొదలైన ఈ టీజర్ ఫుల్ ఫన్‌ని జనరేట్ చేస్తుంది. ఈ చిత్రంలో పునర్నవి శిరీష పాత్రలో కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఇందులో శిరీష క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక్క డైలాగ్‌తో తేల్చేశాడు దర్శకుడు.

‘చూడు అల్లుడూ.. మామూలుగానే అమ్మాయిలు తేనె చూపించి ఆముదం నాకించేస్తారు.. ఇది ఉందే నీ శిరీష.. జామ్ చూపించి జండూ బామ్ నాకించేస్తాది’ అంటూ కమెడియన్ సుదర్శన్ చెప్తున్న డైలాగ్ హీరోయిన్ పాత్రను ఎలివేట్ చేస్తుంది. ఇక ‘ఇంట్లో ఎవరూ లేరు.. త్వరగా వచ్చేసెయ్’ అంటూ ప్రియుడితో తెగ సిగ్గుపడిపోతూ ‘సైకిల్’ తొక్కేస్తోంది పునర్నవి భూపాలం. తాజా టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Please Read Disclaimer