ఓటీటీ ప్రేక్షకులకు మహేష్ సలహా!

0

కరోనా కారణంగా సూపర్ స్టార్స్ నుండి సినీ కార్మికుల వరకు అంతా కూడా గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఉంటున్నారు. సినిమాల స్క్రిప్ట్ చర్చలు ఆన్ లైన్ లో జరుపుతున్నా కూడా ఎక్కువ సమయం ఫ్రీగానే గడుపుతున్నారు. కొందరు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెడుతుంటే మరికొందరు మాత్రం ఈ సమయంలో కిచెన్ లో కొత్త వంటకాలు ట్రై చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఇక అందరు కూడా ఏదో ఒక సమయంలో ఓటీటీపై స్ట్రీమింగ్ చేస్తున్నారు.

పలువురు సెలబ్రెటీలు స్టార్స్ తమకు నచ్చిన వెబ్ సిరీస్ లను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనకు నచ్చిన వెబ్ సిరీస్ ను అభిమానులకు సజెస్ట్ చేశాడు. ఈ లాక్ డౌన్ లో తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ జెర్మన్ టైమ్ ట్రావెలర్ థ్ల్రిర్ ‘డార్క్’. నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డార్క్ తాజాగా మూడవ సీజన్ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది.

గత సీజన్స్ తో పాటు ఈ సీజన్ ను కూడా చాలా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ట్వీట్ తో ‘డార్క్’ వెబ్ సిరీస్ వ్యూస్ అనూహ్యంగా పెరిగి ఉంటాయి. మహేష్ బాబును అంతగా మెప్పించిన విషయాలు ఆ వెబ్ సిరీస్ లో ఏం ఉండి ఉంటాయా అంటూ చాలా మంది స్ట్రీమింగ్ మొదలు పెట్టేసి ఉంటారు.