మళ్లీ మహేష్ మణిశర్మ కాంబో రెడీ

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా అగ్ర తాంబూలం మాత్రం మణిశర్మ కే దక్కుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొన్నటి వరకూ అవకాశాలు లేక మ్యూజిక్ ఇవ్వలేక పోయిన మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం మణి శర్మ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా మెగా స్టార్ సినిమా కూడా మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేసాడు.

చిరు-మణిశర్మ కాంబో తర్వాత ఫ్యాన్స్ ఎదురుచూసే మరో కాంబో మహేష్ – మణిశర్మ లదే. అవును వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. అందుకే లేటెస్ట్ గా తన నెక్ట్స్ సినిమాకు మణిశర్మ ను తీసుకొవాలనే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

భారత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు ఇలా దేవి తో వరుస గా సినిమాలు చేస్తున్న మహేష్ దేవి సాంగ్స్ ట్రోల్ అవుతుండటంతో నెక్స్ట్ వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాకు దేవి ప్లేస్ లో మణిశర్మ ను తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మహేష్ -మణిశర్మ కాంబోలో మరో అదిరిపోయే ఆల్బమ్ రావడం పక్కా.
Please Read Disclaimer