MB 26 దర్శకుడెవరు.. మహేష్ ఏమన్నారు?

0

సరిలేరు నీకెవ్వరు` తర్వాత సూపర్ స్టార్ మహేష్ ఛాయిస్ ఎవరు? ఏ దర్శకుడికి ఒకే చెబుతాడు? అంటూ కొద్ది రోజులుగా ఫ్యాన్స్ లో సస్పెన్స్ కొనసాగుతోంది. మహేష్ కి చాలా మంది దర్శకులు కథలు వినిపించి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో డైలమా కొనసాగుతోంది. ఇప్పటికే సుకుమార్ తో కుదరలేదు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా వ్యవహారం క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి- అనీల్ రావిపూడి పేర్లు మరోసారి పరిశీలనలో ఉన్నాయి. పైడిపల్లి ఇప్పటికే స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా మహేష్ కమిట్ మెంట్ చివరి దశలో ఉందని తెలుస్తోంది. అన్నింటిపైనా మహేష్ కి క్లారిటీ వచ్చేసిందిట. `సరిలేరు నీకెవ్వరు` ప్రమోషన్ లో భాగంగా వివిధ మీడియా సంస్థలకు ఇస్తోన్న ప్రత్యేక ఇంటర్వూల్లో మహేష్ తదుపరి ప్రాజెక్ట్ పై ఓపెనయ్యారు.

`సరిలేరు నీకెవ్వరు` రిలీజ్ తర్వాత మహేష్ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారుట. అనంతరం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతానని తెలిపారు. ఆ సినిమా వంశీ పైడిపల్లితోనే ఉంటుందని కుండబద్దలు కొట్టేసారు. దీంతో మహేష్ తదుపరి ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి సందీప్ వంగాకు హ్యాండ్ ఇచ్చినట్లే అయింది. మహేష్ తో సినిమా చేయాలని అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన దగ్గర నుంచి సందీప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మహేష్ కి స్క్రిప్ట్ ఏదీ నచ్చడం లేదు. అలా ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ఇక మహర్షి చిత్రంతో వంశీ పైడిపల్లి తన ఫేవరెట్ స్టార్ కి బ్లాక్ బస్లర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. నాటి నుంచి మహేష్ ని ఎంతమాత్రం పైడిపల్లి విడిచి పెట్టడం లేదు. మహేష్ ఫ్యామిలీ ఏ విహార యాత్రకు వెళ్లినా వాళ్లతో జాయిన్ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో వంశీతోనే మహేష్ సినిమా ఉంటుందని ఊహాగానాలు ప్రచారమయ్యాయి. అయితే కాలక్రమంలో పైడిపల్లి స్వయంగా ఈ ప్రాజెక్ట్ ను నేను చేస్తున్నానని ప్రకటించారు. తాజాగా నేడు మహేష్ దానిని నిజం చేసారు. మహర్షి తర్వాత పైడిపల్లి స్క్రిప్ట్ ప్రకారం.. మహేష్ ను ఓ గ్యాంగ్ లీడర్ గా చూపించనున్నారని ప్రచారమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.




Please Read Disclaimer