ఈ మాత్రం దానికే ఎందుకా పోటీ అనౌన్స్ మెంట్ ?

0

సాధారణంగా సంక్రాంతి సినిమాలు ఓ మూడు నాలుగు నెలల ముందే డేట్ ఫిక్స్ చేసేసుకొని థియేటర్స్ ఆక్యుపై చేస్తాయి. అయితే ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే మహేష్ బన్నీ నటిస్తున్న రెండు బడా సినిమాలు ఒకే డేట్ ను ఫిక్స్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాయి. సంక్రాంతి రిలీజ్ అంటూ ఎప్పుడో చెప్పేసిన ‘అల వైకుంఠపురములో’ మేకర్స్ సడెన్ ఓ రోజు జనవరి 11 రిలీజ్ అంటూ ప్రకటించారు. సరిగ్గా అదే తేదిన రిలీజ్ చేస్తున్నట్లు ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలు కూడా అనౌన్స్ చేసారు. దీంతో రసవత్తర పోటీ తెరలేచింది.

సంక్రాంతి కి ఒకే రోజు ఇద్దరు బడా హీరోల సినిమాలా అంటూ గట్టిగానే చర్చ నడిచింది. రెండు మూడు రోజుల తర్వాత ఎవరొకరు వెనక్కి తగ్గకపోతారా అంటూ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేసారు. కట్ చేస్తే మొన్నటి వరకూ అదే డేట్ కి స్టిక్ అయిన రెండు సినిమాలు ఎట్టకేల కు డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నాయి.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ జరిపిన ఓ డిస్కర్షన్ లో ఇరు నిర్మాతలు మాట్లాడుకొని డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక రోజు ముందుకు జరిగి జనవరి 11న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక బన్నీ సినిమాకు ఏదైతే డేట్ ప్రకటించారో అదే రోజు అంటే జనవరి 12 నే రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా ‘సరిలేరు’ ప్రీ ప్రోన్ అంటూ ప్రకటించడం తో ఈ మాత్రం దానికి ఎందుకీ అనౌన్స్ మెంట్స్ అదేదో అప్పుడే మాట్లాడుకొని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయచ్చు కదా అంటూ ఆడియన్స్ నవ్వుకుంటున్నారు.
Please Read Disclaimer