#MB 27 లాంచ్.. జూన్ నాటికి కరోనా టెన్షన్ ఉండదని!

0

సూపర్ స్టార్ మహేష్ నటించే 27వ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇటీవల అంతర్జాలంలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజై మూడు నెలలు అయిపోతున్నా.. ఇంకా కొత్త సినిమాని ప్రారంభించకపోవడం అభిమానుల్లో చర్చకొచ్చింది. ఇంతకీ మహేష్ 27 ఎప్పుడు మొదలు కానుంది? అన్నదానికి సరైన సమాధానం లేదు.

ఇప్పటికే పైడిపల్లి కథను పక్కన పెట్టి పరశురామ్ ని ఫైనల్ చేసిన నేపథ్యంలో తాజా చిత్రం ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందించిన పరశురామ్ మహేష్ కోసం ఎలాంటి కథను రాశారు? అన్న ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ తో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ .. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో జారవిడుచుకోను అని ప్రకటించిన పరశురామ్ స్క్రిప్టు విషయంలో అంతే కసిగా పని చేశారని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. జూన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. వాస్తవానికి ఇంకా ముందే మొదలు కావాల్సి ఉన్నా కరోనా వల్ల కొంత ఆలస్యం అవుతోందట. పరశురామ్ అన్ని పనులు పూర్తి చేసి ఫినిషింగ్ టచ్ లు ఇచ్చేస్తున్నాడు.. సినిమా ప్రారంభించి పక్కాగా చెప్పిన టైముకే పూర్తి చేయడం ఎలా? అన్నదానిపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడట. మరోవైపు ఇప్పటికే మూడు నెలల సమయం వృథా అవ్వడంతో మహేష్ – నమ్రత బృందం దీనిపైనా సీరియస్ గానే వర్క్ చేస్తోంది. ఈలోగా వేరే కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేసేందుకు మహేష్ ప్రిపరేషన్ సాగుతోంది. నమ్రత వరసగా కథలు వినే పనిలో ఉన్నారట. అలాగే పూరీతో మహేష్ కి సమన్వయం కుదిర్చేందుకు నమ్రత ప్రయత్నించారన్న గుసగుసలు తాజాగా వినిపించాయి. ఎంతో సీక్రెట్ గా ఈ మీటింగ్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-