ఎట్టకేలకు మహేష్27 కన్ఫర్మ్?

0

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని చేయాలని భావించారు. కాని ఏదో కారణం వల్ల ఆ సినిమా కాస్త క్యాన్సిల్ అయ్యింది. వంశీతో మూవీ క్యాన్సిల్ అయిన తర్వాత మహేష్ బాబు పలువురు దర్శకులతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలువురు దర్శకులు మహేష్ బాబుకు కథలు వినిపించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

ఆమద్య భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు కూడా మహేష్ బాబు నుండి పిలుపు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు 27వ చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ చర్చ జరిగింది. చివరకు మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది.

మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించేందుకు సిద్దం అయ్యారట. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు భారీ పారితోషికంను ఈ రెండు నిర్మాణ సంస్థల వారు ఇస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతుందట. సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జులై నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యాడని తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-