బిగ్ ట్రీట్: పవన్- మహేష్ ఒకే వేదికపైకి..

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ ఇద్దరినీ ఒకే వేదికపై వీక్షించే అరుదైన అవకాశం అభిమానులకు కలగనుందా? అంటే అవుననే సమాచారం. పరిశ్రమను నంబర్ వన్ స్లాట్ లో ఏలిన ఆ ఇద్దరి మధ్యా స్నేహం గురించి తెలిసిందే. అదంతా అటుంచితే.. పదేళ్ల పాటు ఫ్లాపుల తర్వాత ఒకే ఒక్క `గబ్బర్ సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తన సత్తా ఏంటో చాటుకున్న పవన్ కి జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానుల్లో క్రేజ్ ఉంది. పవన్ తరహాలోనే జయాపజయాలకు అతీతంగా ఎదిగిన హీరో మహేష్ బాబు. `ఒక్కడు`తో తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మహేష్ `పోకిరి`తో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గతంలో `అర్జున్` చిత్రం పైరసీకి గురైన సందర్భంగా మహేష్ కు పవన్ మద్ధతుగా నిలిచారు.

ఆ తరువాత మళ్లీ ఈ ఇద్దరు ఒకే వేదికని పంచుకునే సందర్భం రాలేదు. త్వరలో ఆ సందర్భం రాబోతోంది. భారీ మాస్ ఫాలోయింగ్ వున్నఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ సాక్షిగా ఒకే వేదికను పంచుకోబోతున్నారు. తెలుగు సినిమా మనుగడలో కీలక బాధ్యత వహించే.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా ఓ భారీ ఈ వెంట్ని సెప్టెంబర్ 8న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవన్ – మహేష్ ద్వయాన్ని ముఖ్య అతిధులుగా ఆహ్వానించారని .. అందుకు ఆ ఇద్దరూ అంగీకరించారని తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం పైరసీ కోసం ఒకే వేదికని పంచుకుని గళం విప్పిన స్టార్ హీరోలు పవన్ – మహేష్ ఈ వేదికపై తిరిగి కలవబోతున్నారు. ఇది ఇరువురి అభిమానులకు పెద్ద పండగ అనే చెప్పాలి.

సెప్టెంబర్ 8న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరగనున్నఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ – మహేష్ లతో పాటుగా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు- దర్శకులు- 24 శాఖల ముఖ్యులు ఈ ఈవెంట్ కి అటెండ్ కానున్నారని తెలుస్తోంది. వీరితో పాటు భారీ తారాతోరణం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయబోతున్నారు. సినీ అభిమానులకు టెక్నీషియన్లకు ఇదొక మెమరబుల్ డేగా నిలనుంది.
Please Read Disclaimer