లవ్ లీ జంటలకు ఇన్ స్టా యాడ్ రెవెన్యూ

0

సోషల్ మీడియాల్లో ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజీ. మన స్టార్లు నిరంతరం సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్న స్పీడ్ ఎందుకో తెలియాలంటే లోతుల్లోకి వెళ్లాలి. డిజిటల్ మీడియాల్లో ఏదో ఒక ఫోటో లేదా వీడియోని షేర్ చేసి ఫాలోవర్స్ సంఖ్యను అసాధారణంగా పెంచుకుంటున్నారు. ఈ కోవలోనే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ .. ప్రభాస్.. నాగచైతన్య.. సమంత .. అదా శర్మ.. సన్నీలియోన్.. కత్రిన కైఫ్.. వీళ్లంతా భారీ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ కు బానిసలై సందేశాలు.. ఛాయాచిత్రాలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. నటీమణులు హాట్ ఫోటోల్ని.. వీడియోల్ని పోస్ట్ చేయడం ద్వారా అనుచరులను పెంచుకుంటున్నారు.మహేష్ – నమ్రత జంటకు ఇన్ స్టాలో 70లక్షల (7మిలియన్లు) మంది ఫాలోవర్స్ ఉండగా.. సమంతకు కోటి (10 మిలియన్లు) మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాగచైతన్యకు 8 లక్షల మంది మాత్రమే అనుచరులు ఉన్నారు. అల్లు అర్జున్ కి 70లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్.. రామ్ చరణ్ ఇన్ స్టాలో చాలా ఆలస్యంగా ప్రవేశించారు. ప్రభాస్ కు 47లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. చరణ్ కి 25లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ప్రకటనల విషయంలో ఎందుకనో ప్రభాస్.. చరణ్ అంతగా ఆసక్తిని కనబరచలేదు.ప్రస్తుతం పలువురు స్టార్లు ఈ వేదికను ధనార్జన కోసం వినియోగించడంలోనూ పోటీపడుతున్నారు. ముఖ్యంగా మహేష్ .. సమంత ఇలాంటి ఆర్జనలో ఇతరులతో పోలిస్తే సోషల్ మీడియా ఆదాయంలో జరంత స్పీడ్ గానే ఉన్నారన్నది లేటెస్ట్ టాక్.

మహేష్ రెగ్యులర్ గా వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. పలు బ్రాండ్లతో భారీ కాంట్రాక్టులు చేసుకున్నారు ఆయన. ప్రస్తుత కరోనా సంక్షోభం సమయంలో.. ఇన్ స్టాగ్రామ్ లో బ్రాండ్ లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ వేదికపై ఒక్కో బ్రాండ్ రేంజును బట్టి ప్రతి పోస్ట్ కి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ ఆదివారం నాడు మహేష్ – నమ్రత జంట వాషింగ్ పౌడర్ ప్రకటనను ఇన్ స్టాలో ప్రమోట్ చేశారు. ఇక ఇన్ స్టా ఆదాయంలో మహేష్ తర్వాత భారీ ఆదాయం ఉన్న స్టార్ గా సమంత పేరు వినిపిస్తోంది. సామ్ -చైతన్య జంటగానూ సోషల్ మీడియాల్లో ఆర్జిస్తుండడం ఆసక్తికరం. ఇక ఒక్కో బ్రాండ్ టాలీవుడ్ లో పలువరు క్రేజీ జంటలతో ప్రచారం చేయించుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరం.
Please Read Disclaimer