మహేష్ టీమ్ కు వాటర్ చీటింగ్?

0

స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకోసారి చిన్న తప్పులు నిర్లక్ష్యాలు పెను ప్రమాదాలకు దారి తీసే ఛాన్స్ లేకపోలేదు. ఇలాంటిదే మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు టీమ్ కు ఎదురయ్యిందని ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీలో వచ్చిన కథనం అభిమానుల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం కాశ్మీర్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో హీరోతో సహా సభ్యులందరికి వాటర్ సప్లై చేస్తున్న స్టాఫ్ మెంబెర్ వాటిని స్పాట్ లోనే ఉన్న కార్పొరేషన్ టాప్ నుంచే పట్టుకుని ఇస్తున్నాడని తేలిందట.

మొదట గుర్తుపట్టలేకపోయినా మహేష్ స్టాఫ్ ఒకరు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో విషయం ప్రిన్స్ దాకా వెళ్లి ఇంకోసారి ఇలా జరగకుండా చూడమని మేనేజర్లకు కాస్త సీరియస్ గానే చెప్పారట. ఒకవేళ ఇవి తాగడం వల్ల యూనిట్ లో ఎవరికైనా అనారోగ్యం కలిగి షూటింగ్ కి అవాంతరం కలిగితే దానికి ఎవరు బాధ్యులు అనే రీతిలో నిలదీశారట. ఇది నిజమా కాదా అనే నిర్ధారణ లేదు కాని సదరు డైలీలో వచ్చిన కథనం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

అసలే కాశ్మీర్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తాగు నీరు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడున్న సున్నితమైన పరిస్థితులు కాలుష్యం వల్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. లక్కీగా ఆ నీరు తాగడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇబ్బందులు తప్పవి కాదు. అసలే నిర్మాతల్లో మహేష్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. అనుకోకుండా ఏమైనా జరిగితే తనకూ బాధ్యత ఉంటుంది. సో ఇలాంటి రిపీట్ కాకుండా హెచ్చరించడం మంచిదే
Please Read Disclaimer